లావయ్యానని కామెంట్‌ చేస్తే..! | Anne Hathaway slams body shamers on social media | Sakshi
Sakshi News home page

లావయ్యానని కామెంట్‌ చేస్తే..!

Published Mon, Apr 9 2018 12:50 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Anne Hathaway slams body shamers on social media - Sakshi

అన్నె హతవే

అన్నె హతవేకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలోనూ ఆమె పోస్ట్‌లను ఫ్యాన్స్‌ ఎగబడి ఫాలో అవుతుంటారు. తాజాగా ఆమె ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె భారీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఉంది. సన్నగానే ఉంది కదా? ఈ స్థాయిలో ఎక్సర్‌సైజ్‌లు ఎందుకు? అని ఎవ్వరూ ప్రశ్నించకముందే ఆమె చెప్పేసింది, తను ఆ ఎక్సర్‌సైజ్‌లు చేస్తోంది బరువు పెరగడానికని! క్రిస్టొఫర్‌ నోలన్‌ సినిమాలు ‘ది డార్క్‌ నైట్‌ రైజెస్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ సినిమాలతో హాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరుగా ఎదిగిన హతవే, తాజాగా ఓ సినిమాకు లావు అమ్మాయిగా కనిపించనుంది.

అందుకు ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తోంది. ‘‘త్వరలోనే నేను బాగా లావవుతా. నేను లావయ్యానని ఎవరైనా కామెంట్‌ చేస్తే, బాడీ షేమింగ్‌కు వెళితే, నేనొక్కటేమాట చెబుతా.. నేను కాదు, మీరు లావవుతారు. ఇలా బాడీ షేమింగ్‌కు దిగితే!’’ అంటూ ఆ వీడియోతో పాటు కామెంట్‌ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌! బాడీ షేమింగ్‌ ఒక్క సినీ పరిశ్రమ అనే కాకుండా అన్ని చోట్లా ఒక అబ్యూజ్‌గా మారిపోతున్న రోజుల్లో దాని గురించి ఒక టాప్‌ హీరోయిన్‌ మాట్లాడటం మంచి విషయమని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాకోసం హతవే లావెక్కుతుందన్న విషయం మాత్రం సస్పెన్స్‌!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement