US Says "Concerned: రష్యా చైనా వంటి ఇతర దేశాలతో సైనిక కసరత్తులు నిర్వహించనున్నట్లు ప్రకటించిందని అమెరికా పేర్కొంది. రష్యా నిర్వహించనున్న వోస్టాక్ 20200 డ్రిల్స్‌లో చైనా, భారత్‌తో సహా అనేక ఇతరదేశాల నుంచి సుమారు 50 వేల సైనిక బలగాలు పాల్గొంటాయని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. అంతేకాదు ఈ విన్యాసాలను సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాలల్లోని వివిధ ప్రదేశాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనుందని స్పష్టం చేసింది.
అలాగే ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు మొదటగా తూర్పు మిటలరీ డిస్ట్రిక్ట్స్‌లోని ఏడు శిక్షణ ప్రాంతాలో కసరత్తులు నిర్వహించిన తదనంతరం ఓఖోత్క్స్, జపాన్‌లలోని సముద్ర జలాల్లోనూ, తీరప్రాంతాల్లో రక్షణాత్మక్ష ప్రమాదకర విన్యాసాలకు అనుమతిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొందని వెల్లడించింది. ఈ కసరత్తుల్లో సుమారు 50 వేల మంది సైనికుల తోపాటు దాదాపు 140 విమానాలు, 60 యుద్ధ నౌకలు, గన్‌బోట్లు తోసహా సహాయక నౌకలు ఉంటాయని మాస్కో పేర్కొంది.
ఈ సైనిక విన్యాసాల్లో చైనా, భారత్‌లో సహా లావోస్, మంగోలియా, నికరాగ్వా, సిరియా తోపాలు అనేక మాజీ సోవియట్ దేశాలు పాల్గొంటాయని రష్యా చెబుతోంది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగిన దేశంతో ఏయే దేశాలు జతగట్టి ఈ విన్యాసాల్లో పాల్గొంటాయోనని భయంగా ఉందని చెప్పారు. ఐతే ఈ విషయాన్ని ఆయా దేశాల స్వంత నిర్ణయానికి వదిలేస్తున్నామని తేల్చి చెప్పారు.
ఐతే విన్యాసాలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపై న్యూఢిల్లీ నుంచి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. కానీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తూర్ప తీర ప్రాంతాల్లో సైనిక భద్రతను నిర్వహించడానికి, ఆయ ప్రాంతాల్లోని దురాక్రమణ చర్యను తిప్పికొట్టేందుకు ఈ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నట్ల చెబుతోంది. ఐతే గతేడాది రష్యాలో జరిగిన జెడ్‌ఏపీఏడీ 2021 సైనిక కసరత్తుల్లో చైనా పాకిస్తాన్ తోపాటు భారత్ కూడా పాల్గొంది.
(చదవండి: ప్రపంచ పెద్దన్న అమెరికాకు షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?)
Comments
Please login to add a commentAdd a comment