మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. కాకపోతే రుతు సమయంలో యువతులు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే... వేటవూంసం, చికెన్, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ సమయంలోనేగాకుండా మామూలుగానూ తీసుకుంటుంటే వారు కోల్పోయే ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది.
అయితే... రుతుసవుయంలో వారు ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మందకొడిగా మారి వ్యాయామం చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే గాక... మిగతా టైమ్‌లో అలాంటి ఆహారం వల్ల చురుగ్గా ఉండలేకపోవచ్చు.. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... యువతులు, మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి. వేళకు పడుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. అప్పుడే మహిళలకు ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment