రిమ్‌జిమ్.. బ్రెయిన్ జిమ్ | Rim Gym Brain Gym | Sakshi
Sakshi News home page

రిమ్‌జిమ్.. బ్రెయిన్ జిమ్

Published Mon, May 25 2015 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

రిమ్‌జిమ్.. బ్రెయిన్ జిమ్

రిమ్‌జిమ్.. బ్రెయిన్ జిమ్

దేహం ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కు వెళతాం.. మరి బ్రెయిన్ ఫిట్‌గా (చురుగ్గా) ఉండాలంటే..! ఇందుకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. వీటిని చేయించేందుకు ప్రత్యేక జిమ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలం జ్ఞాపకశక్తిని పెంచే వ్యాయామాలు మాత్రమే చేయిస్తారు. ఇప్పుడు సిటీలో వీటికి క్రేజ్ పెరిగింది. మలేషియాలో అంకురించిన బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు సిటీవాసులను అలరిస్తోంది.

ఇన్నాళ్లు చదువుతో బిజీగా గడిపిన తమ పిల్లల్లో చురుకుదనాన్ని పెంచేందుకు దోహదపడుతున్న ఈ డిఫరెంట్ ఎక్సర్‌సైజులకు పిల్లల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. సమ్మర్‌లో ఈ యాక్టివిటీని నేర్చుకునేందుకు పిల్లలను ఆయా శిక్షణ సంస్థల్లో  చేర్పిస్తున్నారు.                                                                     

 
* శిక్షణకు క్యూ కడుతున్న పిల్లలు
* జ్ఞాపకశక్తి పెంచే విభిన్న వ్యాయామాలు..

ఎల్‌కేజీ నుంచి తమ పిల్లలు చదువులో ముందుండాలనే తాపత్రయం నేటి తల్లిదండ్రుల్లో పెరిగింది. దగ్గరుండి మరీ సందేహలు తీరుస్తున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నారు. లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్‌లా తీర్చిదిద్దడానికి పుట్టుకొచ్చిందే బ్రెయిన్ జిమ్.

పిల్లల మెదడుకు పదునుపెట్టి.. చురుగ్గా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. అంతే కాదండోయ్ మెమొరీ గేమ్స్, డాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులను పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహకశక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతున్నారు.
 
రెగ్యులర్‌కు భిన్నంగా..
పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్‌లో నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహరేళ్ల పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్.. మానసిక ప్రశాంతతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్‌సైజు చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలరు.

ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాలా చురుగ్గా, చాకచాక్యంగా ఉంటార’ని చెబుతున్నారు బ్రెయిన్ జిమ్ ఎక్స్‌పర్ట్స్. బ్రెయిన్ జిమ్‌లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్‌సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు.
 
మెమొరీ గేమ్స్‌పై ఆసక్తి..
మెమొరీ గేమ్స్ పిల్లల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్‌ను చూపెడతాం. పది మందిని గుర్తు పెట్టుకోమంటాం. ఏ పొజిషన్‌లో ఏమున్నాయో గుర్తు పెట్టుకొని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్‌లో నంబర్లు చూపెడతాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తు పెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రఫిక్ మెమొరీ అని కూడా అంటారు’ అని చెబుతున్నారు ఎంబీఎం ఇన్‌స్ట్రక్టర్ సపర్ణ.

అలాగే మైండ్ రిలాక్స్ కోసం చేయించే డాన్స్‌కు కూడా పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియో గేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియన్ డాన్స్ స్టెప్పులపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్.

ఇంకా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం లాంటి అంశాల్లోనూ పిల్లలు పరిణతి సాధించేలా చూస్తున్నారు నిపుణులు. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్‌లో పిల్లలతో పాటు అరవై ఏళ్ల వయసు వారిని కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివిటీ ఇంట్రెస్టు వంటివి కూడా నేర్పిస్తున్నారు.
 
శిక్షణ  తరగతులు...
బ్రెయిన్ జిమ్, మెమొరీ ట్రైనింగ్, కాన్సంట్రేషన్ అటెన్షన్ ఇంప్రూవ్‌మెంట్, బిహేవియర్ ఇంప్రూవ్‌మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంఫ్రూవ్‌మెంట్, క్రాఫ్ట్, హ్యాండ్ రైటింగ్‌లో క్లాసులు నిర్వహిస్తోంది మిడ్ బ్రెయిన్ మాస్టర్స్. చేరాలనుకునేవారు 81250 50015 నంబర్‌లో సంప్రదింవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement