న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఔత్సాహికులను పర్యావరణ స్ప్రుహ వైపుకు అడుగులు వేసేలా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. ఆ వేదికపై టాప్ డిజైనర్ క్రియేషన్‌ని మొత్తం పర్యావరణహిత ఫ్యాషన్‌తోనే నింపేసింది. ఆ అద్భుతమైన ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రదర్శనల్లో కమలహాసన్ లేబుల్ హౌస్ ఆప్ ఖద్ధర్‌ను సుతారా కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఇక్కడ కోలీవుడ్ నటుడు కమలహాసన్ ఖాదర్ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇది వంద శాతం ఎకో బ్రాండ్. నేత కార్మికుడు నుంచి నేరుగా ఈ ఫాబ్రిక్‌ను తీసుకుని రూపొందిస్తారు.
ఈ ఫ్యాబ్రిక్ మొత్తం సేంద్రీయ రంగులతోనే తయారు చేయడం విశేషం. సుతారా కలెక్షన్స్ సినిమా, కళలను స్ఫూర్తిగా తీసుకుని స్థిరమైన ఫ్యాషన్ దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్‌తో ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే టొమాటో లెదర్, ఖద్దర్ డెనిమ్ పిక్ నిట్, మస్లిన్ ఖాదీ, వృత్తాకార మెష్ ఫ్యాబ్రిక్‌తో సహా పర్యావరణ అనుకూల పదార్థాలతో ఫ్యాషన్‌ని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇది హస్తకళాకారుల నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.
అదీగాక సెలబ్రిటీలు, ప్రముఖులు, డిజైనర్లు పర్యావరణ అనూకూల ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతరు సారా అలీఖాన్ 60ల నాటి రెట్రో చీరలతో రూపొందించిన లెహంగాతో మెరిసిన సంగతి తెలిసిందే. జీరో కార్బన్‌కి ప్రాధాన్యత ఇచ్చేలా పాత వస్త్రాలను రీసైక్లింగ్ చేసి పొదుపు షాపింగ్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అందులోనూ ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లే జీరోవేస్ట్ డిజైన్‌కి ప్రాముఖ్యత ఇచ్చి..సరికొత్త డిజైనర్‌వేర్‌లను క్రియేట్ చేస్తుండటం మరింత విశేషం. ఈ ఫ్యాషన్ ట్రెండ్‌కి అత్యంత విశేష ప్రజాదరణ లభించడమే గాక పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని ప్రతిబింబిస్తోంది.
(చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!)
Comments
Please login to add a commentAdd a comment