ప్రముఖులు, సెలబ్రిటీలు ట్రెండ్‌కి తగ్గట్టు లగ్జరీయస్ దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్‌గా ఉంటుంది వారి డ్రెస్సింగ్ స్టైల్. అలాంటిది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ మాత్రం ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చే డిజైనర్ వేర్‌లో తళుక్కుమంది. ఈ ముద్దుగుమ్మ దుస్తుల వేస్ట్‌కి అడ్డుకట్ట వేసేలా పర్యావరణ హిత ఫ్యాషన్ శైలిని తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్ ధరించింది అనే కదా సందేహం..!
అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలో ఓ రేంజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర తారలంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారా ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకుంది. డిజైనర్ మయ్యూర్ గిరోత్రా కోచర్ రూపొందించిన అందమైన లెహెంగాలో ఈ బుట్టబొమ్మ మెరిసింది. అయితే ఈ లెహంగాని డిజైనర్ 50, 60ల నాటి పాత చీరలను రీసైక్లింగ్ చేసి రూపొందిచారు. చూడటానికి ఈ లెహంగా వివిధ రంగుల చీరల కలయికతో అందంగా ఉంది. ఈ లెహంగాలో సారా స్టన్నింగ్ లుక్ చూపురులను తిప్పుకోని విధంగా ఆకర్షణీయంగా కనిపించింది. చెప్పాలంటే సారా ఎంచుకున్న డిజైనర్ వేర్ దుస్తుల వేస్ట్‌ని అరికట్టేలే ఫ్యాషన్ ట్రెండ్‌ని సరికొత్త విధంగా సెట్ చెయ్యొచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంది ఆమె మెస్మరైజ్ లుక్.
ఈ మిక్స్‌డ్ కలర్ లెహంగాకి సారా పర్పుల్ కలర్ బ్లౌజ్‌ని జత చేసింది. ఈ బ్లౌజ్‌కి డోరీ టైస్ , గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టీ బార్డర్‌లు ఉన్నాయి. అలాగే ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా రాగి కలర్‌తో కలగలసిన బంగారు టిష్యు సిల్క్ దుప్పట గ్రాడ్ లుక్‌ని తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టు మంచి ఐషాడో, మిరుమెట్లుగొలిపే ఐలైనర్, న్యూడ్ లిప్‌షేడ్‌తో చాలా సింపుల్ మేకప్‌లో మెరిసింది. హెయిర్‌ని కూడా టై చేసి వదిలేసింది. అంతేగాదు తన లెహంగాకి మ్యాచింగ్ అయ్యేలా తలలో ఊదారంగు పూలను ధరించింది. అలాగే చెవులకు జుమ్మీలు, మెడకు పోల్కీ చోకర్ నెక్లస్‌తో గ్రాండ్‌గా కనిపించింది సారా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!)
Comments
Please login to add a commentAdd a comment