New York Fashion Week
-
నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఔత్సాహికులను పర్యావరణ స్ప్రుహ వైపుకు అడుగులు వేసేలా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. ఆ వేదికపై టాప్ డిజైనర్ క్రియేషన్‌ని మొత్తం పర్యావరణహిత ఫ్యాషన్‌తోనే నింపేసింది. ఆ అద్భుతమైన ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రదర్శనల్లో కమలహాసన్ లేబుల్ హౌస్ ఆప్ ఖద్ధర్‌ను సుతారా కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఇక్కడ కోలీవుడ్ నటుడు కమలహాసన్ ఖాదర్ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇది వంద శాతం ఎకో బ్రాండ్. నేత కార్మికుడు నుంచి నేరుగా ఈ ఫాబ్రిక్ను తీసుకుని రూపొందిస్తారు. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం సేంద్రీయ రంగులతోనే తయారు చేయడం విశేషం. సుతారా కలెక్షన్స్ సినిమా, కళలను స్ఫూర్తిగా తీసుకుని స్థిరమైన ఫ్యాషన్ దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్‌తో ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే టొమాటో లెదర్, ఖద్దర్ డెనిమ్ పిక్ నిట్, మస్లిన్ ఖాదీ, వృత్తాకార మెష్ ఫ్యాబ్రిక్‌తో సహా పర్యావరణ అనుకూల పదార్థాలతో ఫ్యాషన్‌ని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇది హస్తకళాకారుల నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది. అదీగాక సెలబ్రిటీలు, ప్రముఖులు, డిజైనర్లు పర్యావరణ అనూకూల ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతరు సారా అలీఖాన్ 60ల నాటి రెట్రో చీరలతో రూపొందించిన లెహంగాతో మెరిసిన సంగతి తెలిసిందే. జీరో కార్బన్‌కి ప్రాధాన్యత ఇచ్చేలా పాత వస్త్రాలను రీసైక్లింగ్ చేసి పొదుపు షాపింగ్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అందులోనూ ప్రముఖ లగ్జరీ బ్రాండ్లే జీరోవేస్ట్ డిజైన్‌కి ప్రాముఖ్యత ఇచ్చి..సరికొత్త డిజైనర్‌వేర్‌లను క్రియేట్ చేస్తుండటం మరింత విశేషం. ఈ ఫ్యాషన్ ట్రెండ్‌కి అత్యంత విశేష ప్రజాదరణ లభించడమే గాక పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని ప్రతిబింబిస్తోంది. (చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!) -
ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సిబ్బంది..ఇంతకీ ఏం జరిగిందంటే..
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్లా వాక్ చేశాడు. పాలిథీన్ కవర్నే కాస్టూమ్గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc — Censored Men (@CensoredMen) September 11, 2023 -
ఆ నవ్వు వెనక చెప్పలేనంత కష్టం!
భారత్‌కు చెందిన ఓ యువతి న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో గురువారం పాల్గొని ర్యాంపుపై చిరునవ్వులు చిందించింది. ఇందులో విశేషం ఏముందంటారా..! ఆమె అందరు మోడల్స్ లా కాదు. యాసిడ్ దాడి బాధితురాలు అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉంది. యాసిడ్ దాడిలో ఓ కంటిని కోల్పోయిన రేష్మా ఖురేషీ(19) ఎంతో మనో వేదనకు గురైంది. 2014లో తన బావ(అక్క భర్త), అతడి స్నేహితులు కలిసి ఖురేషి ముఖంపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఏదో సాధించాలన్న కసితో ఉన్న ఆమె ఎగిసిన కెరటంలా ముందడుగు వేసింది. భారతీయ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన డిజైన్లను న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేస్తూ ప్రదర్శించింది. ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది తనకు చాలా గొప్ప అనుభవమని ఖురేషీ పేర్కొంది. ఈ ఈవెంట్ లో పాల్గొని తనలాగ యాసిడ్ దాడికి గురైన ఎంతో మంది మహిళలకు ఈ సందర్భంగా సందేశాన్నిచ్చింది. మనం ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఇతర వ్యక్తుల తరహాలోనే జీవితాన్ని మనం కూడా ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చింది. తనలాంటి వారిని తక్కువ చేసి చూడకూడదని, అవకాశమిస్తే అందరిలా తాము బయటకు వెళ్లగలమని, ఏదైనా చేయగలమని ధీమా వ్యక్తం చేసింది. సరిగ్గా గురువారమే.. ప్రీతిరాఠి అనే నర్సుపై 2013లో యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైన నేరస్థుడు అంకుర్ లాల్ పన్వార్‌కు ప్రత్యేక మహిళల న్యాయస్థానం ఉరి శిక్ష విధించడం గమనార్హం. -
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సీఎం భార్య!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ గురువారం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనువిందు చేయనున్నారు. బాలికల విద్యను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీల పిల్లలు రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ఫడ్నవిస్ ర్యాంప్ మీద కనిపించనున్నారు. 'బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతో నేను ర్యాంప్ మీద నడవబోతున్నాను. నిజానికి ఈ చేనేత వస్త్రాలను రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించారు. వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం గొప్ప వినూత్నమైనది. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని చదివించినట్టు అవుతుంది. కుటుంబమంతా విద్యావంతులైతే అప్పుడు దేశం పురోగమిస్తుంది.' అని అమృత ఫడ్నవిస్ మీడియాతో తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.