ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త, కారణమేంటంటే? | Bhagyashree Husband Himalaya Dasani Goes Surgery | Sakshi

Bhagyashree: ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త

Nov 5 2022 4:45 PM | Updated on Nov 5 2022 4:55 PM

Bhagyashree Husband Himalaya Dasani Goes Surgery - Sakshi

భుజంలోని రొటేటర్‌ కఫ్‌ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్‌ కఫ్‌ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది. వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్‌ కఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడతడు కోలుకున్నాడు'

బాలీవుడ్‌ నటి భాగ్య శ్రీ భర్త హిమాయ్‌ దాసానీకి సర్జరీ జరిగింది. అతడి కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారని నటి సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'భుజంలోని రొటేటర్‌ కఫ్‌ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్‌ కఫ్‌ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది. వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్‌ కఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతడు కోలుకుంటున్నాడు, తిరిగి నవ్వుతున్నాడు' అంటూ భర్తతో దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

కాగా భాగ్యశ్రీ... సల్మాన్‌ ఖాన్‌తో మైనే ప్యార్‌ కియా(ప్రేమ పావురాలు) అనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన మరుసటి ఏడాది (1990) హిమాలయ్‌ను పెళ్లాడింది. వీరికి అభిమన్యు అనే కొడుకు, అవంతిక అనే కూతురు ఉన్నారు. తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న భాగ్యశ్రీ రాధేశ్యామ్‌ చిత్రంతో ఇటీవలే టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది.

చదవండి: షాకింగ్‌ ఎలిమినేషన్‌: బిగ్‌బాస్‌ దెబ్బకు గీతూ అబ్బ!
కేరళ స్టోరీ: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్‌ ఎలా అయింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement