bhagya sree
-
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్‌కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్ కియా వంటి మూవీలో మంచి హిట్లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్‌తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు. గ్రీన్ జ్యూస్‌తో కలిగే లాభాలు..ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్ జ్యూస్ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట గుణాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది. తయారీ..నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్లో వేసి మెత్తగా జ్యూస్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్ జ్యూస్ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త, కారణమేంటంటే?
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ భర్త హిమాయ్ దాసానీకి సర్జరీ జరిగింది. అతడి కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారని నటి సోషల్ మీడియాలో వెల్లడించింది. 'భుజంలోని రొటేటర్ కఫ్ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్ కఫ్ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది. వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్ కఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతడు కోలుకుంటున్నాడు, తిరిగి నవ్వుతున్నాడు' అంటూ భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. కాగా భాగ్యశ్రీ... సల్మాన్ ఖాన్‌తో మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) అనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మరుసటి ఏడాది (1990) హిమాలయ్ను పెళ్లాడింది. వీరికి అభిమన్యు అనే కొడుకు, అవంతిక అనే కూతురు ఉన్నారు. తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న భాగ్యశ్రీ రాధేశ్యామ్ చిత్రంతో ఇటీవలే టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) చదవండి: షాకింగ్ ఎలిమినేషన్: బిగ్‌బాస్ దెబ్బకు గీతూ అబ్బ! కేరళ స్టోరీ: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్ ఎలా అయింది? -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి
బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలయ్యారు. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించి టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయిన ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె సడెన్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇచ్చారు. చదవండి: ‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బెల్లంకొండ హీరోతో టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ మూవీలో భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్! -
ప్రభాస్ అలా మాట్లాడతాడని ఊహించలేదు : నటి
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. 'రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించడం సంతోషంగా అనిపించింది. ఆయన చాలా గొప్ప నటుడు. పాన్ ఇండియాలో ప్రభాస్‌కు ఎంతో క్రేజ్ ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ సినిమా సెట్లోనే ప్రభాస్‌ని చూశాను. ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా అతనే నా దగ్గరికి వచ్చాడు. నా అభిమాని అంటూ ప్రభాస్ చెప్పడంతో షాక్ అయ్యాను. ఆయన అంత సింపుల్‌గా ఉంటారనీ, అంత చనువుగా మాట్లాడతారని ఊహించలేదు' అని చెప్పుకొచ్చారు. -
‘రాధేశ్యామ్’లో నా పాత్ర ఇదే: సీనియర్ నటి
సల్మాన్ ఖాన్ హీరోగా ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. కానీ త్వరగానే వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సినీయర్ నటి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆ సినిమాలో తన పాత్ర గురించి తెలిపింది. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘రాధే శ్యామ్‌లో నాది తల్లి పాత్ర కాదు. కథలో ఎంతో కీలమైంది. నా పాత్రని తీసేస్తే స్టోరీ మొత్తానికి ప్రాబ్లమ్ అవుతుంది. ఇకపై ఇలాంటి పాత్రలే చేస్తా. ఎడిటింగ్‌లో పోయే రోల్స్ చేస్తే ఉపయోగం ఉండదు. ఈ సినిమా నాతోనే పాత్ర మొదలై, చివరి వరకు సాగుతుంది. అందుకే ఈ మూవీ చేశా’ అని తెలిపింది. ఈ మూవీలో చాలా భాగం విదేశాల్లో చేశారని, అయితే వాటి కంటే ఎంతో ఖర్చుపెట్టి గ్రాండియర్‌గా హైదరాబాద్‌లో వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయని భాగ్య శ్రీ చెప్పింది. అందుకే ఈ సినిమాని బుల్లితెర మీద కంటే వెండితెర మీదనే చూస్తే ఆ ఫీల్ బావుంటుందని చిత్రబృందం థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటుందని పేర్కొంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో ప్రేక్షకులు ఆయన నుంచి అలాంటి సినిమాలే కోరుకుంటున్నారని తెలిపింది. కాగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, పూజాహేగ్డే హీరోయిన్గా చేసిన ‘రాధే శ్యామ్’ 2022లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చదవండి: ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! -
‘దిల్ దివానే’ను దించేశారు..
-
సేమ్ టు సేమ్ దించేశారు!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ‘మై నే ప్యార్ కియా’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జోడిగా నటించిన ఈ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ప్రేమకథా చిత్రంతోనే చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్ చెరగని ముద్ర వేశాడు. ఈ సినిమాలోని ‘దిల్ దివానే’ పాట చాలా పాపులర్ అయింది. తాజాగా ఓ జంట ఈ పాటను అనుకరిస్తు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాటలోని సాహిత్యానికి అనుగుణంగా ఈ జంట చేసిన అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు కూడా ఈ వీడియో నచ్చిందని పేర్కొంటూ నటి రవీనా టాండన్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఇంటర్నెట్లో ఈ వీడియో చూసి బాగా ఆస్వాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడిది అన్న వివరాలు వెల్లడి కాలేదు. -
నగదు కోసమే హత్య
దొడ్డబళ్లాపురం : గౌరిబిదనూరు–గుడిబండ మార్గం మధ్య బుధవారం లభించిన గుర్తుతెలియని యువతి మృతదేహం వివరాలు పోలీసులకు లభించాయి. మృతురాలిని దేవనహళ్లి తాలూకా హరళూరు నాగేనహళ్లికి చెందిన భాగ్యశ్రీ (22)గా గుర్తించారు. డబ్బుల కోసమే దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. భాగ్యశ్రీ కన్నమంగలపాళ్య వద్ద ఉన్న మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో విధులు నిర్వహించేది. ఆదివారం సాయంత్రం కార్యాలయానికి చెందిన రూ.5 లక్షల నగదును దేవనహళ్లి కార్యాలయానికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే అదృశ్యమైంది. దీంతో యువతి తల్లితండ్రులు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గౌరిబిదనూరు–గుడిబండ మార్గంలో భాగ్యశ్రీ మృతదేహం లభించింది. భాగ్యశ్రీ తీసికెళ్తున్న నగదు కోసమే ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని హతురాలి తల్లితండ్రులు డిమాండు చేస్తున్నారు. -
ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు భాగ్యశ్రీ
సాక్షి, హైదరాబాద్: ఫెన్సింగ్ క్రీడలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి తిప్పిరినేని భాగ్యశ్రీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. అల్జీరియాలో జరుగనున్న ప్రపంచకప్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈనెల 13 నుంచి 15 వరకు వరల్డ్‌కప్ పోటీలు జరుగుతాయి. గతేడాది జరిగిన జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె విశేషంగా రాణించింది. ఆ టోర్నీలో 8వ ర్యాంకులో నిలిచి వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. -
ఫ్యాషన్ ఫెస్ట్
ట్రెడిషనల్ వస్త్రాలు, ఫ్యాషన్ డిజైనింగ్స్‌తో ఆకృతి ఎలైట్ ఫ్యాషన్ పెయిర్ కళకళలాడుతోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ఈ ఎక్స్పోను సినీ నటి భాగ్యశ్రీ (వెయ్యి అబద్ధాలు) ప్రారంభించింది. దసరా సీజన్‌కు ఆహ్వానం పలుకుతూ.. పెయిర్ ప్రాంగణాన్ని ట్రెడిషనల్‌గా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు, దేశాలకు చెందిన 90 మంది డిజైనర్ల కలెక్షన్లు ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుబాయ్, బ్యాంకాక్, పాకిస్థాన్ తదితర దేశాలకు చెందిన స్టాల్స్ ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. దాండియా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ. బుధవారంతో ముగియనున్న ఈ ఎక్స్‌పోలో గోటాపట్టీ శారీస్, డిజిటల్ ప్రింట్ శాలువాలు, లెహంగా, యాక్సెరీస్, బండర్ వాల్స్, బెనార స్ మ్యాట్స్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. -
తెరపై భాగ్యశ్రీ తనయుడు!
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘మైనే ప్యార్ కియా’ హీరోయిన్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ‘మైనే ప్యార్ కియా’లో భాగ్యశ్రీకి జంటగా నటించిన సల్మాన్ ఖాన్ త్వరలోనే అభిమన్యును తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భాగ్యశ్రీ మాత్రం ఈ ఊహాగానాలపై పెదవి విప్పడం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు తన కొడుకు తెరంగేట్రం గురించి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెబుతోంది. -
బుల్లితెర మీద ప్రేమపావురం!
‘కబూతర్ జా జా జా కబూతర్ జా’ అంటూ వెండితెర మీద ఆమె కదులుతుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అప్పట్లో. ఆ ఒక్క సినిమా ఆమెని అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలబెట్టేసింది. ఆమె ఎవరో అర్థమైపోయింది కదూ... అవును, భాగ్యశ్రీనే. ‘మైనే ప్యార్ కియా’ని ఆమె కోసమే మళ్లీ మళ్లీ చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగువారి మనసులనూ దోచేసింది శ్రీ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఇరవై సినిమాలు కూడా చేయకుండానే సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో చేసిన ‘ఓంకారం’ చిత్రమే ఆమె చివరి సినిమా. ఆ తరువాత కాపురం, పిల్లలు అంటూ ఓ సాధారణ మహిళలా బతకసాగింది. అయితే ఆమె లోని నటీమణి అలానే ఉండిపోలేకపోయింది. హిందీ సీరియళ్లతో పునఃప్రవేశం చేసింది. ఇంతవరకూ ఓ అయిదు సీరియళ్లు చేసింది. ఇప్పుడు ఆరో సీరియల్ ‘లౌట్ ఆవో త్రిష’తో రాబోతోంది. పద్దెనిమిదేళ్ల కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన, ఆతృత ఎలా ఉంటాయన్నదే ఈ సీరియల్. త్రిష అనే అమ్మాయికి తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది. దాదాపు సీరియల్ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిష అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో విచిత్రమైన అనుభవాలు ఎదురు కావడం, వాటిని సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని ఊరిస్తున్నారు... ఈ సీరియల్‌ని ప్రసారం చేయనున్న లైఫ్ ఓకే చానెల్ వారు. ఏబీసీ చానెల్లో ప్రసారమైన ‘మిస్సింగ్’ ఆధారంగా ఈ సీరియల్‌ని రూపొందించారు. ‘మిస్సింగ్‌ను కేవలం పదే పది ఎపిసోడ్లతో ముగించారు. మరి హిందీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి!