ఫ్యాషన్ ఫెస్ట్
ట్రెడిషనల్ వస్త్రాలు, ఫ్యాషన్ డిజైనింగ్స్‌తో ఆకృతి ఎలైట్ ఫ్యాషన్ పెయిర్ కళకళలాడుతోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ఈ ఎక్స్‌పోను సినీ నటి భాగ్యశ్రీ (వెయ్యి అబద్ధాలు) ప్రారంభించింది. దసరా సీజన్‌కు ఆహ్వానం పలుకుతూ.. పెయిర్ ప్రాంగణాన్ని ట్రెడిషనల్‌గా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు, దేశాలకు చెందిన 90 మంది డిజైనర్ల కలెక్షన్లు ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుబాయ్, బ్యాంకాక్, పాకిస్థాన్ తదితర దేశాలకు చెందిన స్టాల్స్ ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. దాండియా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ. బుధవారంతో ముగియనున్న ఈ ఎక్స్‌పోలో గోటాపట్టీ శారీస్, డిజిటల్ ప్రింట్ శాలువాలు, లెహంగా, యాక్సెరీస్, బండర్ వాల్స్, బెనార స్ మ్యాట్స్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.