traditional dress
-
శారీలో మెస్మరైజ్ చేస్తున్న రింకూ రాజ్‌గురు... ఆకట్టుకుంటున్న (ఫొటోలు)
-
ఎగిరే పక్షినౌతా..!
చీర కట్టుకున్నప్పుడు తనకు స్త్రీనన్న భావన కలుగుతుందని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ అన్నారు. ‘‘చీర నా జీవితంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించింది. నేను గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిని. అక్కడ చీర కట్టుకునే సంప్రదాయం లేదు. నటిని అయ్యాక చీరపై నాకు క్రమంగా ఇష్టం ఏర్పడింది. చీర కట్టుకున్నప్పుడు నా మనసు స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది. చీరలో ఏదో పవర్ ఉంది’’ అని ఢిల్లీలో టైటాన్ ‘తనేరియా’ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా కంగనా అన్నారు. 31 ఏళ్ల కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని భంబ్లా పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగారు. 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. బాలీవుడ్‌కి వచ్చాకే కంగనా ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారు. -
సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయండి
డయల్ యవర్ ఈవోలో భక్తుడి విజ్ఞపి తిరుమల : తిరుమలలో విధిగా తిరునామ ధారణ, సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ సంప్రదాయ వస్త్రధారణ అమలు చేస్తున్నామని, తిరునామం అమలుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విజయ్‌భాస్కర్(అనంతపురం), కుమార్ (కడప): కల్యాణకట్ట, గదుల రీఫండ్ కౌంటర్ల వద్ద నగదు డి మాండ్ చేస్తున్నారు. ఈవో: ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వేంకటేశ్వరరావు(ఏలూరు): వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాన్ని అప్పుడప్పుడు రద్దు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉంది. ఈవో: రద్దీ సమయాల్లోనే ముందస్తు సమాచారంతో వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. రామారావు(గుంటూరు), కేశవన్ (చంద్రగిరి): రూ.50 టికెట్లు సాయంత్రం స్లాట్ రావడం లేదు. కోటాను పెంచండి. ఈవో: టికెట్ల పెంపుపై పరిశీలిస్తాం. ఎం.ప్రసాద్(విశాఖపట్నం): టీటీడీ కల్యాణ మండపాలు, ఈ-దర్శన్ కౌంటర్లలో ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించండి. ఈవో: పరిశీలిస్తాం. శేషుబాబు(పాలకొల్లు): అదనపు లడ్డూ కౌంటర్లో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టండి. ఈవో: అక్కడి సిబ్బంది తగిన సూచనలు ఇస్తాం. పార్ధసారథి(గుంటూరు): తిరుమలలో పోటు కార్మికుల పేరు మార్చండి. ఈవో: పేరు మార్పును పరిశీలిస్తాం. సురేష్ (కాకినాడ): బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు గ్యాలరీల్లో మరుగుదొడ్ల వసతి కల్పించండి. ఈవో: అవసరమైనన్ని మొైబైల్, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తాం. రామదాస్(తమిళనాడు): తమిళనాడు నుంచి పాదయాత్రగా తిరుమలకు వచ్చే భక్తులకు పుత్తూరులోని టీటీడీ కల్యాణమండపంలో విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించండి. ఈవో: ఎలాంటి కార్యక్రమాలు లేని సందర్భాల్లో పాదయాత్ర భక్తులకు కేటాయిస్తాం. నాగేశ్వరరావు(రేణిగుంట): తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాల వద్ద భిక్షగాళ్లను అరికట్టండి. ఈవో: కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. వెంకయ్య(హైదరాబాద్): క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అందించే అన్నప్రసాదాలు వృథా అవుతున్నాయి. ఈవో: తగిన చర్యలు తీసుకుంటాం. గోపి(తిరుపతి): తిరుచానూరు తోళప్ప గార్డెన్స్ కల్యాణమండపాల్లో కరెంటు పోతే జనరేటర్ లేదు. ఈవో: పరిశీలిస్తాం. హరనాథ్‌రెడ్డి (హైదరాబాద్): పర్వదినాల్లో దాతలకు శ్రీవారి దర్శనం కల్పించండి. ఆనందనిలయం అనంత స్వర్ణమయం గురించి తెలపండి. ఈవో: ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. అనంతస్వర్ణమయం పథకాన్ని రద్దు చేశాం. దాతల అంగీకారం మేరకు విరాళాలను మరో పథకానికి మళ్లిస్తాం. దాతలు కోరుకుంటే తిరిగి చెల్లిస్తాం. -
‘సంప్రదాయం’గా వస్తేనే.. శ్రీవారి దర్శనం
⇒ ప్రస్తుతం ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300,రూ.50 సుదర్శనంలో డ్రస్కోడ్ అమలు ⇒సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ తప్పనిసరి చేయాలని టీటీడీ యోచన సాక్షి, తిరుమల : సనాతన హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పటికే ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300, రూ.50 సుదర్శనంలోనూ ఇదే విధా నం అమలు చేస్తున్నారు. మిగిలిన సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ సంప్రదాయ దుస్తులను అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితాలిస్తున్న సంప్రదాయ వస్త్రధారణ రెండు దశాబ్దాలకు ముందు సంప్రదాయ వస్త్రధారణ కేవలం కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు మాత్రమే అమలు చేశారు. తర్వాత దశలో అని రకాల ఆర్జిత సేవలకు అమలు చేశారు. నాలుగేళ్లుగా వీఐపీ దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి చేశారు. ఇదే విధానాన్ని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు గత ఆగస్టు 27వ తేదీ నుంచి రూ.300 ఆన్లైన్ టికెట్ల భక్తులకు అమలు చేసేలా చర్యలు చేపట్టారు. దీనినే గత నెల నుంచి 50 రూపాయల సుదర్శనం భక్తులకూ అమలు చేస్తున్నారు. అన్ని దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తుల విధానం అమలు చక్కగా సాగుతోంది. ప్రారంభంలో బాలారిష్టాలున్నా, తర్వాత యథావి ధిగా సాగుతోంది. సర్వదర్శనం, దివ్యదర్శనానికి డ్రస్కోడ్.. ప్రస్తుతం అమలు చేసే దర్శనాల్లో భక్తులు ఇంటిల్లిపాదిగా సంప్రదాయ దుస్తులతో వెళుతున్నారు. ఈ డ్రెస్‌కోడ్‌పై అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. దీంతో మిగిలిన సర్వదర్శనం, దివ్యదర్శనం, చంటిబిడ్డల తల్లిదండ్రుల దర్శనం, వికలాంగులు, వృద్ధుల వంటి దర్శనాలకూ డ్రస్కోడ్ అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆలయ అర్చకులు, ఆగమ పండితులు కూడా ఇదే అభిప్రా యం వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి రావడం వల్ల భక్తుల్లో భక్తిభావంతో పాటు సనాతన హైందవ సంస్కృతిని చాటేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
త్వరలోనే ఆన్‌లైన్‌లోకి మరో 7 వేల టికెట్లు
* దివ్యదర్శనం, సర్వదర్శనానికి టైంస్లాట్ * సంప్రదాయ దుస్తులు తప్పనిసరి * టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల విధానం విజయవంతంగా కొనసాగుతోందని, దీనికి మరో 7 వేల టికెట్లను అనుసంధానం చేస్తామని టీటీడీ జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 వేల టికెట్లను ఆన్లైన్ లోకి మళ్లించాక తిరుమలలో కరెంట్ బుకింగ్ ఉండదన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనంలో మార్పులు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సర్వదర్శనం కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్ణీత సమయం ప్రకారం టికెట్లు కేటాయించి స్వామి దర్శనం కల్పిస్తామని చెప్పారు. కాలిబాటల్లో వచ్చే భక్తులను సైతం రోజులో పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతించేందుకు వీలుగా టికెట్లపై నిర్ణీత సమయం కేటాయిస్తామన్నారు. రాబోయే రెండు నెలల్లో దాదాపు అన్ని రకాల దర్శనాల్లోనూ మార్పులు వస్తాయని తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం రూ.300 ఆన్లైన్ టికెట్ల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని చెప్పారు. ఫ్యాంటుపై పంచె కట్టుకుంటే అనుమతించేది లేదన్నారు. భక్తులు కూడా టీటీడీకి సంపూర్ణంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఫ్యాషన్ ఫెస్ట్
ట్రెడిషనల్ వస్త్రాలు, ఫ్యాషన్ డిజైనింగ్స్‌తో ఆకృతి ఎలైట్ ఫ్యాషన్ పెయిర్ కళకళలాడుతోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ఈ ఎక్స్పోను సినీ నటి భాగ్యశ్రీ (వెయ్యి అబద్ధాలు) ప్రారంభించింది. దసరా సీజన్‌కు ఆహ్వానం పలుకుతూ.. పెయిర్ ప్రాంగణాన్ని ట్రెడిషనల్‌గా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు, దేశాలకు చెందిన 90 మంది డిజైనర్ల కలెక్షన్లు ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుబాయ్, బ్యాంకాక్, పాకిస్థాన్ తదితర దేశాలకు చెందిన స్టాల్స్ ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. దాండియా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ. బుధవారంతో ముగియనున్న ఈ ఎక్స్‌పోలో గోటాపట్టీ శారీస్, డిజిటల్ ప్రింట్ శాలువాలు, లెహంగా, యాక్సెరీస్, బండర్ వాల్స్, బెనార స్ మ్యాట్స్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. -
హ్యాపీ డే
-
చీకట్లను చీల్చిన ‘క్రికెట్’
క్రికెట్.. ఓ దేశంలో మతంలా ఆరాధించే క్రీడ. మరో దేశంలో జాతీయ క్రీడ. మరికొన్ని దేశాల్లో.. అన్నింట్లో ఓ క్రీడ. క్రికెట్‌పై ప్రేమతో, ఆరాధనతో దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారు కొందరైతే.. ఈ క్రీడకున్న ఆదరణ, భారీ రెమ్యూనరేషన్ల కారణంగా ఆకర్షితులయ్యేవారు మరికొందరు. కానీ, ప్రపంచంలో తామూ ఉన్నామన్న ఉనికిని సమాజానికి చాటేందుకు, తరతరాల తమ వెనకబాటును ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు క్రికెట్ ఆడుతున్నారు.. కెన్యాలోని మసాయ్ తెగ ప్రజలు. ప్రమాణాలకు తగినట్లుగా బ్యాట్లు లేవు.. ఖరీదైన బూట్లు లేవు. స్పాన్సర్ చేసే కార్పొరేట్ సంస్థలు లేవు.. వేసుకునేందుకు కనీసం జెర్సీలు కూడా లేవు. ఒంటిని సగం మాత్రమే కప్పివుంచే తమ సంప్రదాయ దుస్తులతో, మండుటెండలో టోపీలు కూడా పెట్టుకోకుండానే క్రికెట్ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు మసాయ్ క్రికెట్ వారియర్స్. కెన్యాలోని లైకిపియా ప్రాంతానికి చెందిన ఈ గిరిజనులు శతాబ్దాల తరబడి నాగరికతకు దూరంగా జీవనం సాగిస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చి కెన్యాలోని సరస్సుల లోయ ప్రాంతాల్లో స్థిరపడిన ఈ మసాయ్ తెగ ప్రజలు.. విద్యకు, వైద్యానికి కూడా నోచుకోకుండా, తమ పూర్వీకులనే అనుసరిస్తూ, అవే ఆచారాలు, అదే జీవనవిధానాన్ని అవలంబిస్తూ బతుకీడుస్తున్నారు. అయితే తమ భవిష్యత్ తరాలైనా నాగరిక ప్రపంచంతో కలిసి జీవించేలా, విద్య, ఉద్యోగావకాశాలు పొందేలా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు క్రికెట్ ఒక్కటే వారికి పరిష్కారంగా కనిపించింది. ఈటెలు పట్టిన చేతులతో బ్యాట్లు.. క్రికెటే తమను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లగలదని నమ్మి.. చేతిలోనుంచి ఈటెల్ని పక్కనబెట్టి బ్యాట్లను పట్టుకున్నారు. తమకు తామే శిక్షణనిచ్చుకున్నారు. మసాయ్ జాతి ప్రజలు నివసించే అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ జట్లను రూపొందించుకొని వాటి మధ్య పోటీలు నిర్వహించుకున్నారు. దీంతో వారనుకున్నట్లుగానే అందరి దృష్టినీ ఆకర్షించగలిగారు. తరాలుగా తమ జీవితాలను కమ్మేసిన చీకట్లను చీల్చగలిగారు. మసాయ్ క్రికెట్‌ను మీడియా వెలుగులోకి తెచ్చింది. ఏకంగా క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లోని నర్సరీ గ్రౌండ్లో నిర్వహించిన ‘లాస్ట్ మ్యాన్ ఆఫ్ స్టాండ్స్’ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు మసాయ్ వారియర్స్‌కు అవకాశం లభించింది. గత ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 4 దాకా నిర్వహించిన ఈ టి20 టోర్నీలో పాల్గొన్న 11 అంతర్జాతీయ స్థాయి జట్లతో కలిసి మసాయ్ వారియర్స్ జట్టు ఆడింది. ఈ టోర్నీలో మసాయ్ వారియర్స్ విజయం సాధించలేకపోయింది.. కానీ, తాము ఏ లక్ష్యంతోనైతే క్రికెట్ బ్యాట్లు చేతబట్టారో అది నెరవేరింది. తామంటూ ఉన్నామని ప్రపంచం గుర్తించేలా చేసింది. వారి జీవన స్థితిగతులపై ఓ ఔత్సాహికుడు డాక్యుమెంటరీ రూపొందించి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. ఇకపై క్రికెట్లో వారు ఏ స్థాయికి ఎదగగలరన్నది పక్కనబెడితే వారి తదుపరి లక్ష్యం.. తమ ప్రాంతాల్లో పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం అందాలి. తామూ సామాజికంగా ఎదగాలి.. క్రికెట్ ద్వారానే అది సాధ్యం కావాలన్నదే మసాయ్ ప్రజల ఆకాంక్ష. వారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. -
కేక.. పుట్టించారు !