సల్మాన్ ఖాన్ హీరోగా ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. కానీ త్వరగానే వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సినీయర్ నటి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆ సినిమాలో తన పాత్ర గురించి తెలిపింది.
బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘రాధే శ్యామ్‌లో నాది తల్లి పాత్ర కాదు. కథలో ఎంతో కీలమైంది. నా పాత్రని తీసేస్తే స్టోరీ మొత్తానికి ప్రాబ్లమ్ అవుతుంది. ఇకపై ఇలాంటి పాత్రలే చేస్తా. ఎడిటింగ్‌లో పోయే రోల్స్ చేస్తే ఉపయోగం ఉండదు. ఈ సినిమా నాతోనే పాత్ర మొదలై, చివరి వరకు సాగుతుంది. అందుకే ఈ మూవీ చేశా’ అని తెలిపింది.
ఈ మూవీలో చాలా భాగం విదేశాల్లో చేశారని, అయితే వాటి కంటే ఎంతో ఖర్చుపెట్టి గ్రాండియర్‌గా హైదరాబాద్‌లో వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయని భాగ్య శ్రీ చెప్పింది. అందుకే ఈ సినిమాని బుల్లితెర మీద కంటే వెండితెర మీదనే చూస్తే ఆ ఫీల్ బావుంటుందని చిత్రబృందం థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకుంటుందని పేర్కొంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో ప్రేక్షకులు ఆయన నుంచి అలాంటి సినిమాలే కోరుకుంటున్నారని తెలిపింది. కాగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, పూజాహేగ్డే హీరోయిన్‌గా చేసిన ‘రాధే శ్యామ్’ 2022లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
చదవండి: ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!
Comments
Please login to add a commentAdd a comment