హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే | Bhagyashri Borse Entered Ram Pothineni New Film | Sakshi
Sakshi News home page

హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే

Published Wed, Nov 20 2024 4:39 PM | Last Updated on Wed, Nov 20 2024 6:03 PM

Bhagyashri Borse Entered Ram Pothineni New Film

టాలీవుడ్‌ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్‌ 21న  పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. హీరో రామ్‌కు 22వ సినిమా ఇది.

రామ్‌ సరసన హీరోయిన్‌గా  భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.

'మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement