బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్ కియా వంటి మూవీలో మంచి హిట్‌లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్‌తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు.
గ్రీన్ జ్యూస్‌తో కలిగే లాభాలు..
ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్ జ్యూస్ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట గుణాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది.
తయారీ..
నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్‌లో వేసి మెత్తగా జ్యూస్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్ జ్యూస్ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..)
Comments
Please login to add a commentAdd a comment