నగదు కోసమే హత్య | Woman Murder Mystery Reveals | Sakshi
Sakshi News home page

నగదు కోసమే హత్య

Sep 7 2018 11:58 AM | Updated on Sep 7 2018 11:58 AM

Woman Murder Mystery Reveals - Sakshi

హతురాలు భాగ్యశ్రీ (ఫైల్‌)

దొడ్డబళ్లాపురం : గౌరిబిదనూరు–గుడిబండ మార్గం మధ్య బుధవారం లభించిన గుర్తుతెలియని యువతి మృతదేహం వివరాలు పోలీసులకు లభించాయి.  మృతురాలిని దేవనహళ్లి తాలూకా హరళూరు నాగేనహళ్లికి చెందిన భాగ్యశ్రీ (22)గా గుర్తించారు.   డబ్బుల కోసమే దుండగులు ఆమెను కిడ్నాప్‌ చేసి   హత్య చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. భాగ్యశ్రీ కన్నమంగలపాళ్య వద్ద ఉన్న మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయంలో విధులు నిర్వహించేది. ఆదివారం సాయంత్రం కార్యాలయానికి చెందిన రూ.5 లక్షల నగదును దేవనహళ్లి కార్యాలయానికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే అదృశ్యమైంది.  దీంతో  యువతి తల్లితండ్రులు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గౌరిబిదనూరు–గుడిబండ మార్గంలో భాగ్యశ్రీ మృతదేహం లభించింది. భాగ్యశ్రీ తీసికెళ్తున్న నగదు కోసమే ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని హతురాలి తల్లితండ్రులు డిమాండు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement