
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.
'రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించడం సంతోషంగా అనిపించింది. ఆయన చాలా గొప్ప నటుడు. పాన్ ఇండియాలో ప్రభాస్‌కు ఎంతో క్రేజ్ ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ సినిమా సెట్లోనే ప్రభాస్‌ని చూశాను. ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా అతనే నా దగ్గరికి వచ్చాడు. నా అభిమాని అంటూ ప్రభాస్ చెప్పడంతో షాక్ అయ్యాను. ఆయన అంత సింపుల్‌గా ఉంటారనీ, అంత చనువుగా మాట్లాడతారని ఊహించలేదు' అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment