
బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలయ్యారు. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించి టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయిన ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె సడెన్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇచ్చారు.
చదవండి: ‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బెల్లంకొండ హీరోతో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ మూవీలో భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment