Avantika Dasani
-
అఫీషియల్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!) ఈ మూవీ ఈనెల 14నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. నేను స్టూడెంట్ సార్ బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం కాగా.. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుతోని ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) Ee Student vachesthunnadu...!🙋♂️ Get ready for a thrilling experience..😯 Premieres July 14 🥳#GaneshBellamkonda@NaandhiSATISH#rakhiuppalapati@avantikadassani @suneeltollywood@thondankani pic.twitter.com/0xNtW4wn65 — ahavideoin (@ahavideoIN) July 3, 2023 -
ఆడియన్స్ థ్రిల్ అవుతారు
‘‘నేను స్టూడెంట్ సర్’లోని ఎమోషన్స్‌కు ఎక్కువగా స్టూడెంట్స్, యూత్ కనెక్ట్ అవు తారు. స్క్రీన్ ప్లే క్యూరియాసిటీతో నడుస్తుంది. ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా.. ‘‘ప్రేక్షకుల టైమ్, డబ్బు వృథా కావు’’ అన్నారు రాకేష్. ‘‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘డబ్బే ఒక ఐడియాలజీ అనేది ఈ సినిమా రూట్ కాన్సెప్ట్’’ అన్నారు ఈ చిత్రకథారచయిత కృష్ణ చైతన్య. -
నాంది క్రేజ్‌ని ‘నేను స్టూడెంట్’ నిలబెడుతుంది: సతీష్ వర్మ
‘‘బాహుబలి, హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం’ లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలావరకు ఏ సినిమానీ నేను రెండోసారి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను.. ఎక్కడా బోర్ కొట్టదు. కోవిడ్ కారణంగా 40 ఏళ్లకు పైబడిన వారు ‘నాంది’ సినిమాని ఎక్కువగా థియేటర్‌కి వచ్చి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం అన్ని వయసుల వారు థియేటర్‌కి వచ్చి చూసేలా ఉంటుంది’’ అని నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’.సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’లో యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్‌ని చూపించాం. గణేష్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మంచి థ్రిల్లర్ జోనర్లో కథ సాగుతుంది. ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమా నిలబెడుతుందని భావిస్తున్నాను. కృష్ణ చైతన్యగారి కథని రాకేష్ ఉప్పలపాటి చక్కగా తీశారు. నటి భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతికని మా సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం చేయడం హ్యాపీ. మా తర్వాతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అన్నారు. -
ప్రతిభ ఉంటే సరిపోదు, టైం కూడా కలిసిరావాలి
‘‘ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు సరైన టైమ్ కూడా కలిసిరావాలని నమ్ముతాను. ఎందుకంటే ఫిల్మ్‌నగర్, కృష్ణానగర్‌లో దర్శకులు కావాలనుకునే కొందరితో నేను మాట్లాడుతున్నప్పుడు వారిలో నా కన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నట్లు అనిపిస్తుంటుంది’’ అని డైరెక్టర్ రాకేష్ ఉప్పలపాటి అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్!’. రాకేష్ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేష్ ఉప్పలపాటి మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం భీమడోలు. నాన్నగారి వ్యాపారం నిమిత్తం తాటిపాకకు మారాం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత తేజగారి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. కృష్ణ చైతన్యగారి కథతో ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా చేశాను. హీరోకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హీరోకి, ఓ పోలీస్ కమిషనర్‌కు మధ్య ఎలాంటి యుద్ధం నెలకొంది? అనేది ఇందులో ఆసక్తిగా ఉంటుంది. నిర్మాత ‘నాంది’ సతీష్గారితోనే మరో సినిమా చేస్తాను’’ అన్నారు. -
నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ వచ్చేసింది
స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి
బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలయ్యారు. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించి టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయిన ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె సడెన్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇచ్చారు. చదవండి: ‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బెల్లంకొండ హీరోతో టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ మూవీలో భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్! -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురే అవంతిక దాసానీ!
అవంతిక దాసానీ.. డిజిటల్ స్క్రీన్ మీద మెరిసిన మరో నటనా వారసురాలు. ‘మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు)’ తో వెండి తెర సంచలనమైన తార గుర్తుంది కదా! భాగ్యశ్రీ!! అవును ఆ తల్లి బిడ్డే ఈ అవంతిక దసానీ. లండన్‌లోని క్యాస్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసొచ్చి.. నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. ముందుగా డిజిటల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది జీ5 ఒరిజినల్ ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్‌తో. నటనారంగంలోకి రావడానికి వారసత్వం ఉపయోగపడుతోందేమో కానీ నిలబడ్డానికి మాత్రం ప్రతిభే అవసరం అని నిరూపిస్తోంది. ► పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లి.. భాగ్యశ్రీ.. నటి. తండ్రి.. హిమాలయ్ దాసానీ.. బిజినెస్‌మన్. అవంతికకు ఒక సోదరుడూ ఉన్నాడు. అభిమన్యు దాసానీ. అతనూ నటుడే. ► చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఫ్యాషన్ డిజైన్ పట్లా ప్రేమ కనబరచేది. ఇంకో వైపు కుటుంబ వ్యాపారాల్లోనూ తండ్రికి సాయంగా ఉండాలని ఉత్సాహపడేది. చివరకు నటనా రంగంలోకి రావాలనే నిర్ణయించుకుంది. ► జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘మిథ్య(2022)’తో అవంతిక తన లక్ష్యాన్ని సగం వరకు చేరుకుంది. తన అభినయాన్ని వెండితెర మీద చూపించాలనేది ఆమె లక్ష్యం. అదీ త్వరలోనే నెరవేరనుందట. ► క్రీడల్లోనూ ఫస్టే. ఆమె..ప్రొఫెషనల్ కిక్ బాక్సర్. తన కిక్ బాక్సింగ్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ►డాన్స్, ట్రావెలింగ్లు ఆమె అభిరుచులు.