Nenu Student Sir Movie OTT Release Date Confirmed, Check For Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Nenu Student Sir OTT Release: ఓటీటీకి సిద్ధమైన 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Mon, Jul 3 2023 9:09 PM | Last Updated on Tue, Jul 4 2023 11:53 AM

Nenu Student Sir OTT Release Date Fixed Streaming On July 14th - Sakshi

బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది సతీష్‌ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

(ఇది చదవండి: టచ్‌ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్‌ తీరుపై నటుడు కామెంట్స్!)

ఈ మూవీ ఈనెల 14నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సునీల్‌, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. నేను స్టూడెంట్ సార్ బెల్లంకొండ గణేష్‌ నటించిన రెండో చిత్రం కాగా.. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుతోని ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. 

(ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement