Nenu Student Sir Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్
Tomorrow OTT Movies: ఓటీటీ మూవీ ప్రేమికులారా.. రెడీ అయిపోండమ్మా! వచ్చేస్తున్నాయ్ వచ్చేస్తున్నాయ్.. మీకోసం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శుక్రవారం అనగా జూలై 14న ఒక్కరోజే దాదాపు 19 వరకు విడుదలవుతున్నాయి. ఇందులో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మూవీస్-సిరీస్‌లు చాలా ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా ఏయే సినిమాలు వస్తున్నాయో లిస్ట్ చూసేయండి. ఏ టైమ్‌లో ఏది చూడాలో ప్లాన్ చేసుకోండి. వీకెండ్‌ని ఫెర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసేయండి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) శుక్రవారం(జూలై 14) ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ అమెజాన్ ప్రైమ్ తండాట్టి - తెలుగు డబ్బింగ్ సినిమా ద సమ్మర్ ఐ టర్నెడ్ ప్రెట్టీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ హాస్టల్ డేస్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ బర్డ్ బాక్స్ బార్సిలోనా - ఇంగ్లీష్ సినిమా లవ్ టాక్టిక్ట్స్ 2 - టర్కిష్ మూవీ టూ హాట్ టూ హ్యాండిల్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ కోహ్రా - హిందీ చిత్రం - జూన్ 15 సోనిక్ ప్రైమ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డెవిల్స్ అడ్వకేట్ - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) బర్న్ ద హౌస్ డౌన్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్) సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (స్ట్రీమింగ్) ఆహా నేను స్టూడెంట్ సర్ - తెలుగు సినిమా మెన్ టూ - తమిళ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద ట్రయల్ - హిందీ సిరీస్ సోనీ లివ్ కాలేజ్ రొమాన్స్ సీజన్ 4 - హిందీ సిరీస్ జియో సినిమా ఇష్క్ ఈ నదాన్ - హిందీ సినిమా జీ5 మాయాబజార్ ఫర్ సేల్ - తెలుగు సిరీస్ ఎస్టేట్ - తమిళ సినిమా - జూన్ 16 ఆపిల్ టీవీ ప్లస్ ఫౌండేషన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ మనోరమ మ్యాక్స్ టిక్కక్కొరు ప్రేమొందరన్ - మలయాళ సినిమా (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!) -
అఫీషియల్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!) ఈ మూవీ ఈనెల 14నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. నేను స్టూడెంట్ సార్ బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం కాగా.. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుతోని ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) Ee Student vachesthunnadu...!🙋♂️ Get ready for a thrilling experience..😯 Premieres July 14 🥳#GaneshBellamkonda@NaandhiSATISH#rakhiuppalapati@avantikadassani @suneeltollywood@thondankani pic.twitter.com/0xNtW4wn65 — ahavideoin (@ahavideoIN) July 3, 2023 -
ఈ సినిమా చేయడానికి కారణం ఇదే...!
-
హీరో హీరోయిన్ కి మాత్రమే గొడుగులు ఎందుకు పడతారంటే..
-
'నేను స్టూడెంట్ సార్' మూవీ ట్విటర్ రివ్యూ
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓవరీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పూర్తయింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నేను స్టూడెంట్ సార్ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని కొందరు ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమా సరికొత్త థ్రిల్ అందించిందని పేర్కొంటున్నారు. కొందరేమో ఫుల్ ఎమోషనల్ డ్రామా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. Dialogues bagunnay, comedy ga start ayyindhi cinema#NenuStudentSir! pic.twitter.com/QBBHJYIeSe — D kalyan (@emptypockettss) June 2, 2023 Picha comedy ra aiyya 😂#NenuStudentSir pic.twitter.com/iV3tEL1Gpb — The Sanjay Siva (@SanjaySiva01) June 2, 2023 This is an really an good concept movie with good action thriller movie and with good drama entertainment in theatre's book your tickets now and watch it today. All the best team#NenuStudentSir 🎟️ https://t.co/Nlv9ZFR0vM#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Bharani (@PrabhasSeenu1) June 1, 2023 Edi cinema ante elanti good and interesting concept tho movie vasthe 💥 blockbuster talk easy ga vastadi Releasing today on theatre book your tickets now 😁#NenuStudentSir! 🎟️ https://t.co/LFP5XOyaUu#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Natrajan (@Siddharthroy031) June 1, 2023 -
ఆడియన్స్ థ్రిల్ అవుతారు
‘‘నేను స్టూడెంట్ సర్’లోని ఎమోషన్స్‌కు ఎక్కువగా స్టూడెంట్స్, యూత్ కనెక్ట్ అవు తారు. స్క్రీన్ ప్లే క్యూరియాసిటీతో నడుస్తుంది. ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా.. ‘‘ప్రేక్షకుల టైమ్, డబ్బు వృథా కావు’’ అన్నారు రాకేష్. ‘‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘డబ్బే ఒక ఐడియాలజీ అనేది ఈ సినిమా రూట్ కాన్సెప్ట్’’ అన్నారు ఈ చిత్రకథారచయిత కృష్ణ చైతన్య. -
నటుడిగా నేను సక్సెస్ అయ్యా: బెల్లంకొండ గణేశ్
‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా రంగప్రవేశం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ గణేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ► నేను ఎప్పుడూ స్టూడెంట్‌లానే ఫీలవుతాను. రియల్ లైఫ్‌లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము. ► ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ► ఈ పాత్ర నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది. ► భాగ్యశ్రీ మా అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకున్నాం. ► నాందితో మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పని చేశారు. అందరికంటే ముందు సెట్‌కు వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. ► స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమకంతో నిర్మాతలు ఆ డేట్‌కు విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. అయితే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. ► మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు.