‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా రంగప్రవేశం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ గణేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
► నేను ఎప్పుడూ స్టూడెంట్‌లానే ఫీలవుతాను. రియల్ లైఫ్‌లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము.
► ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను.
► ఈ పాత్ర నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది.
► భాగ్యశ్రీ మా అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకున్నాం.
► నాందితో మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పని చేశారు. అందరికంటే ముందు సెట్‌కు వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.
► స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమకంతో నిర్మాతలు ఆ డేట్‌కు విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. అయితే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.
► మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment