
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం 'స్వాతి ముత్యం'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ఈ చిత్రం ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో సక్సెట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది.
(చదవండి: Varsha Bollamma: వర్ష బొల్లమ్మ 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..)
కథ ఎలా ఉందంటే: 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం 'స్వాతిముత్యం'. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారు.
Overall ga #SwathimuthyamOnAHA, pakka entertainer 😉
— ahavideoin (@ahavideoIN) October 18, 2022
Premieres Oct 28@VarshaBollamma #GaneshBellamkonda @vamsi84 @Lakshmankkrish2 @adityamusic pic.twitter.com/dO9W6yUFvD