అవంతిక దాసానీ.. డిజిటల్ స్క్రీన్ మీద మెరిసిన మరో నటనా వారసురాలు. ‘మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు)’ తో వెండి తెర సంచలనమైన తార గుర్తుంది కదా! భాగ్యశ్రీ!! అవును ఆ తల్లి బిడ్డే ఈ అవంతిక దసానీ. లండన్‌లోని క్యాస్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసొచ్చి.. నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. ముందుగా డిజిటల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది జీ5 ఒరిజినల్ ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్‌తో. నటనారంగంలోకి రావడానికి వారసత్వం ఉపయోగపడుతోందేమో కానీ నిలబడ్డానికి మాత్రం ప్రతిభే అవసరం అని నిరూపిస్తోంది.
► పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లి.. భాగ్యశ్రీ.. నటి. తండ్రి.. హిమాలయ్ దాసానీ.. బిజినెస్‌మన్. అవంతికకు ఒక సోదరుడూ ఉన్నాడు. అభిమన్యు దాసానీ. అతనూ నటుడే.
► చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఫ్యాషన్ డిజైన్ పట్లా ప్రేమ కనబరచేది. ఇంకో వైపు కుటుంబ వ్యాపారాల్లోనూ తండ్రికి సాయంగా ఉండాలని ఉత్సాహపడేది. చివరకు నటనా రంగంలోకి రావాలనే నిర్ణయించుకుంది.
► జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘మిథ్య(2022)’తో అవంతిక తన లక్ష్యాన్ని సగం వరకు చేరుకుంది. తన అభినయాన్ని వెండితెర మీద చూపించాలనేది ఆమె లక్ష్యం. అదీ త్వరలోనే నెరవేరనుందట.
► క్రీడల్లోనూ ఫస్టే. ఆమె..ప్రొఫెషనల్ కిక్ బాక్సర్. తన కిక్ బాక్సింగ్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
►డాన్స్, ట్రావెలింగ్‌లు ఆమె అభిరుచులు.
Comments
Please login to add a commentAdd a comment