Bollywood Actress Bhagyashree Shares Relation Affairs With Salman Khan - Sakshi
Sakshi News home page

Bhagyashree: నీ భార్యకు సల్మాన్‌తో సంబంధమేంటని అడిగారు: భాగ్య శ్రీ

May 15 2023 9:14 PM | Updated on May 16 2023 8:50 AM

Bollywood Actress Bhagyashree Shares Relation Affairs With Samlan Khan - Sakshi

మైనే ప్యార్ కియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజైంది. సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది.

(ఇది చదవండి: ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..)

మైనే ప్యార్‌ కియా సినిమా తనకు సక్సెస్‌తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్‌తో రిలేషన్‌లో ఉందని బీటౌన్‌లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు.

భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ' నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్‌ వచ్చారు. విషెస్‌ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్‌ఖాన్‌తో మీ భార్య రిలేషన్‌ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్‌ మ్యాగజైన్స్‌ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అ‍న్నారు.

(ఇది చదవండి: బాలీవుడ్‌ క్వీన్‌.. సూపర్‌ హిట్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!)

అంతేకాకుండా.. సల్మాన్‌ ఎంతో మంచి వ్యక్తి అని.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్‌ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు భాగ్యశ్రీ. ఇక పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ తక్కువ సినిమాలే చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్‌’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్‌కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన హిందీ వర్షన్ ఛత్రపతి హీరోకు తల్లి పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement