అందాల హీరోయిన్‌ వెజిటబుల్‌ సూప్‌ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే! | Actress Bhagyashree Vegetable Soup Recipe Video Goes Viral, See Netizens Reactions | Sakshi
Sakshi News home page

అందాల హీరోయిన్‌ వెజిటబుల్‌ సూప్‌ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!

Published Thu, May 30 2024 1:30 PM | Last Updated on Thu, May 30 2024 3:41 PM

Actress bhagyashree vegetable soup recipe netizens Reacts

ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్‌ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా  తయారు చేసుకునే వెజిటబుల్‌ సూప్‌ గురించి ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

వెజిటబుల్‌ సూప్‌: క్యారట్‌, కాప్సికమ్‌,  ఫ్రెంచ్‌బీన్స్‌,  వెన్న, మైదా  కార్న్‌ ఫ్లోర్‌, పాలు, చీజ్‌ సాయంతో  సూప్‌ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్‌, చిల్లీ సాస్‌ యాడ్‌ చేసి చీజ్‌తో గార్నిష్‌  చేసింది.

అయితే‌ దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్‌ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని  ఎవాయిడ్‌ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement