Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి? | Maha Shivaratri 2025: What is the Speciality of Sweet Potato | Sakshi
Sakshi News home page

Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?

Published Tue, Feb 25 2025 5:37 PM | Last Updated on Tue, Feb 25 2025 6:02 PM

Maha Shivaratri 2025: What is the Speciality of Sweet Potato

మహా శివరాత్రి  పర్వదినాన  పరమశివుణ్ని అత్యంత  భక్తిశ్రద్ధలతో  పూజిస్తారు. అభిషేకాలు, ఉపవాసాలు  జాగారాలతో భక్తకోటి శివుణ్ని ఆరాధిస్తారు. రోజంతా నిష్టగా ఉవవాసం ఉండి, జాగరణ దీక్ష చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఎంత ఓపిక లేకపోయినా, తన శక్తికొద్దీ ఆ   ముక్కంటిని పూజిస్తారు. ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కొందరు 24 గంటలు, మరికొందరు ఒక్క పొద్దు ఇలా పలువిధాలుగా ఉపవాస దీక్ష పాటిస్తారు. అయితే శివరాత్రి ఉపవాస దీక్ష అనగానే చాలామందికి గుర్తొచ్చేది  చిలగడ దుంప. శివరాత్రికీ  చిలగడదుంపకీ ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం రండి!

మహాశివరాత్రి రోజున  ఉపవాస దీక్ష విరమించిన తరువాత  భక్తులుచాలామంది చిలగడ దుంపతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఈ దుంపలో ఉన్న  ఆరోగ్యకరమైన ప్రయోజనాలే ఇందుకు  కారణం.  స్వీట్ పొటాటో  లేదా చిలగడదుంపలను  ధనసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా  రకరకాల  పేర్లతో పిలుస్తారు. చిలగడ దుంపలను ఆరోజు తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.    ఉపవాస అలసట నీరసం తగ్గి ఎక్కువ శక్తినిస్తుంది.

చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్‌ టిప్స్‌

హల్దీ ఫంక్షన్‌లో హను​మాన్‌ హల్‌చల్‌.. వైరల్‌ వీడియో

చిలగడదుంప ఆరోగ్య ప్రయోజనాలు
చిలగడదుంపలలో విటమిన్లు ఏ, సీ, బీ,డీ, కే,  జింక్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బీటా కెరోటిన్‌కు మంచి మూలం. ఇందులోని ఫైబర్‌  జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఎముకల బలానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా కేన్సర్, తదితర  దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది.

ఇంకా

  •  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

  •  కళ్ళు పొడిబారడం, రాత్రి అంధత్వాన్ని నివారిస్తాయి. 

  • ఇందులోని విటమిన్‌ఏ  కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

  • జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం  లభిస్తుంది

  • ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. నాడీ , జ్ఞాపకశక్తి సామర్థ్యంలో మెరుగుదలను సాధిస్తాయి.

మహా శివరాత్రి స్పెషల్‌గా

వీటిని పాలలో ఉడికించి తినవచ్చు.  సలాడ్లు, కూర రూపంలో తీసుకోవచ్చు. చిక్కటి పాలు డ్రైఫ్రూట్స్‌తో కలిపి చిలగడ దుంప పాయసం  లేదా చిలగడదుంప హల్వా  చేసుకోవచ్చు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement