Sweet Potato
-
టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో బొబ్బట్లు మీకోసమే..!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక, తొక్క తీసి.. కొద్దిగా పాలు కలిపి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నీళ్లు – సరిపడా, బాదం, జీడిపప్పు – 15 చొప్పున ఏలకులు – 4, నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ – పావు కప్పు బెల్లం తురుము – అర కప్పు ఉప్పు – చిటికెడు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని 10 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ చిన్నమంట మీద దోరగా వేయించాలి. అందులో చిలగడదుంప పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అనంతరం బెల్లం తురుము వేసుకుని కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు మిశ్రమం వేసుకుని కలపాలి. మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం గోధుమ పిండి ముద్దను.. చిన్నచిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్‌లా తీసుకుని.. గిన్నెలా ఒత్తుకుని.. దానిలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని పెట్టుకుని బాల్స్‌లా చుట్టుకోవాలి. వాటిపై కొద్దికొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ.. చపాతీల్లా చేసుకుని.. నేతిలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..! -
స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించుకుని, తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి) ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొబ్బరి తురుము – అర కప్పు కారం – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్ జీలకర్ర పొడి – అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె, గోరువెచ్చని నీళ్లు – కొద్దికొద్దిగా ఉప్పు – తగినంత నువ్వులు – కొద్దిగా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, చిలగడదుంపల ముక్కలు, కొబ్బరి తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అప్పడాల్లా ఒత్తి.. అందులో చిలగడదుంపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి.. తిరిగి మళ్లీ బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నువ్వులు అద్ది.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఇవి చదవండి: ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..! -
బంగాళదుంప Vs చిలగడ దుంప: డయాబెటీస్ పేషెంట్లకు ఏదీ మంచిది?
మారుతున్న జీవనశైలి కారణంగా మనదేశంలో డయాబెటీస్ రోగులు అంతకంతకు పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలికి సైలంట్ కిల్లర్ వ్యాధి. నెమ్మదిగా శరీర భాగాల పనితీరుని దెబ్బతీస్తుంది. అప్రమత్తతతో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం డేంజర్లో ఉన్నట్లే. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడమే మంచిది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహం వస్తుంది. ముఖ్యంగా దుంప జాతికి సంబంధించిన చిలగడ దుంపలు, బంగాళ దుంపల విషయంలో చాలామందికి ఈ డౌటు వస్తుంది. అయితే ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే.. ముఖ్యంగా ఈ రెండిటీ విషయంలోనే ఎందుకూ అందరూ తినొచ్చా? వద్దా? అన్న డౌటు పడుతున్నారంటే.. ప్రధాన కారణం రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటమే. ఇవి రెండు భూమిలోనే పెరుగుతాయి. ఇక చిలగ దుంప తియ్యగా కూడా ఉంటుంది. దీంతో బాబోయ్! అని వాటి జోలికి కూడా పోరు షుగర్ పేషెంట్లు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చిలగడ దుంపలను బేషుగ్గా తినండి అని చెబుతున్నారు. ఎందుకంటే? గ్లైసెమిక్ ఇండెక్స్ బంగాళదుంపలోనూ చిలగడదుంపల్లోనూ వేర్వురుగా ఉంటుందట. అందులో బంగాళదుంపలకు సంబంధించిన కొన్ని జాతుల్లో మరీ వ్యత్యాసం ఉంటుందట. అయితే చిలగడదుంపల్లో ఫైబర్‌తో కూడి ఉంటాయి. పైగా గ్లైసెమిక్ కంటెంట్ కూడా చాలా తక్కువే. ఇందులో ముఖ్యంగా అధిక ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ ఉంటాయని అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలగడ దుంపలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. బంగాళ దుంపలను వండుకుని తీనే తీరుని బట్టి డయాబెటీస్ రోగులకు మంచి షోషకాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే? ఉడకబెట్టిన బంగాళదుంపలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. అదే వాటిని డీప్ ఫ్రై లేదా ఇతరత్ర విధానంలో ఫ్రై వంటి కూరల్లా చేసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అలాగే చిలగ దుండపలను చక్కగా ఉడకబెట్టుకుని ఏదైనా ప్రోటీన్ మూలంతో తినడం మంచిదని అంటున్నారు. అమ్మో అవి స్వీట్‌గా ఉంటాయన్న భయం ఉంటే..కనీసం ఆ స్వీట్ పొటాటోని ఉకడబెట్టి వాటిపై దాల్చిన పొడి జల్లుకుని తీసుకున్న మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అలాగే బంగాళదుంపల్లో పోటాషియం అధికంగా ఉండటమే గాక కొన్నిరకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండిటిని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అంతేగాదు ఈ దుంపలు కార్బోహైడ్రేట్ వర్గంలోకి వస్తాయి కూరగాయాల కిందకి రావని అర్థం చేసుకోండని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినేటప్పుడూ చీజ్, ఆయిల్ వంటి ఇతరత్ర కొలస్ట్రాల్‌తో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది శక్తి వనరుగా శరీరానికి అత్యంత అవసరమైనదని గుర్తించుకోవాలి. దాన్ని సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమ్య ఉండదని చెబుతున్నారు నిపుణులు గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే ఇస్తున్నాం. పాటించే మందు మీ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని మీ వ్యక్తిగత వైద్యులు లేదా డైటీషియన్లన సలహాలు సూచనలతో ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్‌పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు
కావలసినవి: చిలగడదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు పచ్చిమిర్చి ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా శనగపిండి – పావు కప్పు బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – 1 టీ స్పూన్ చొప్పున నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, చిలగడదుంప గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చిలగడదుంప–గరం మసాలా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌లో బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, బజ్జీల్లా.. కాగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. (చదవండి: కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు.. ) -
స్పెషల్ డేస్ కోసం ప్రత్యేకంగా ఖీర్.. ఇలా చేసుకోండి
స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి) పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3 కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్‌కి) తయారీ విధానమిలా... ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్‌లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. -
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ ఇలా!
అసలే ఉరుకుల పరుగుల జీవితం, దీనికితోడు ఒత్తిడి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించకపోతే ఏ పనీ సరిగా చేయలేం. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయినా తగ్గదు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే స్ట్రెస్ ఇట్టే తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వంటకాలు ఎలా వండుకోవాలో చూద్దాం.... ఆవకాడో టోస్ట్ కావలసినవి: ►ఆవకాడో గుజ్జు – పావు కప్పు ►రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్ – ఒకటి ►ఉడికించిన గుడ్డు – ఒకటి ►ఆలివ్ ఆయిల్ – టీస్పూను ►నిమ్మరసం – టీస్పూను ►సబ్జా గింజలు – టీస్పూను ►ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ: ►బ్రెడ్ స్లైస్‌ను రెండు ముక్కలుగా కట్ చేయాలి ►బ్రెడ్ ముక్కలపై ఆవకాడో గుజ్జుని పొరలా రాసి, దీనిపైన గుడ్డుని స్లైసులుగా కట్ చేసి పెట్టాలి ►చివరిగా నిమ్మరసం, సబ్జాగింజలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. చిలగడ దుంప సూప్ కావలసినవి: ►నూనె – టేబుల్ స్పూను ►జీలకర్ర – అర టీస్పూను ►ఆవాలు – అర టీస్పూను ►పసుపు – పావు టీస్పూను ►అల్లం తురుము – టే బుల్ స్పూను ►వెల్లుల్లి తురుము – టేబుల్ స్పూను ►పచ్చిమిర్చి – రెండు ►నిమ్మచెక్క – ఒకటి ►టొమాటో – ఒకటి (సన్నగా తరగాలి) ►చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్ – నాలుగు కప్పులు ►తొక్కతీసిన చిలగడ దుంపల తురుము – రెండు కప్పులు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్‌ను తీసుకుని పసుపు, ఉప్పు వేసి మీడియం మంట మీద మరిగించాలి ►పదినిమిషాల తరువాత చిలగడ దుంపల తురుము, అల్లం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసి ఉడికించాలి ►ఈ దుంపల మిశ్రమాన్ని పది నిమిషాలు ఉడికించాక టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి ∙కాగిన నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ►ఆవాలు వేగాక కరివేపాకు వేసి వేయించాలి. ►దీనిలో మరిగించిన సూప్‌ను పోయాలి చివరిగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Tomato Keema Balls Recipe: టొమాటో కీమా బాల్స్.. తయారీ ఇలా! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
Health Tips: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు! ఇవి తింటే...
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ►కండరాలు బలహీనంగా మారుతాయి. ►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. ►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods).. ►కోడిగుడ్లు ►టమాటాలు ►చిలగడ దుంపలు ►విత్తనాలు ►నట్స్ ►అరటి పండ్లు ►యాప్రికాట్స్ ►చేపలు ►తృణ ధాన్యాలు ►పెరుగు ►పాలు ►మాంసం ►తర్బూజా ►క్యారెట్ ►నారింజ ►కివీ ►కొబ్బరినీళ్లు బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్.. ఇంట్లోనే ఇలా ఈజీగా!
బయట చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా ఇంట్లో ఏదైనా క్రిస్పీగా చేసుకుని తింటే ఆ మజానే వేరు! ఈ వర్షాకాలంలో చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్ ట్రై చేయండి మరి! తియ్యటి కట్లెట్ కావలసినవి: ►నానపెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు ►చిలగడ దుంప – పెద్దది ఒకటి ►వడగట్టిన సొరకాయ తురుము – పావు కప్పు ►జీడిపప్పు పొడి – రెండు టేబుల్ స్పూన్లు ►పుదీనా ఆకులపొడి – టీస్పూను ►జీలకర్ర పొడి – టీస్పూను ►కారం – అరటీస్పూను ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం: ►చిలగడ దుంపను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి ►చిదుముకున్న దుంప మిశ్రమంలో మిగతా పదార్థాలన్నింటిని వేసి చక్కగా కలపాలి ►ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్ రాసుకుని మిశ్రమాన్ని కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో ఆయిల్ వేయాలి. ►ఆయిల్ వేడెక్కిన తరువాత కట్లెట్లను వేసి రెండువైపులా క్రిస్పీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చాలి. ►ఇలా చేస్తే తియ్యటి కట్లెట్ రెడీ. ఏ చట్నీతోనైనా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్ పకోడి చేసుకోండి! Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా! -
Recipe: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!
గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం! చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి: ►చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.) ►గోధుమ పిండి –2 కప్పులు ►గోరువెచ్చని నీళ్లు – సరిపడా ►మైదాపిండి – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►గరం మసాలా – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ►సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ►20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ►ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా తయారీ ఇలా! Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! -
ఎంత పెద్ద చిలగడదుంపో..!
కోహీర్ (జహీరాబాద్): చిలగడ దుంప, రత్నపురిగడ్డ, మొర్రం గడ్డ ఇలా పలు పేర్లతో పిలిచే స్వీట్ పొటాటో సాధారణంగా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువు తూగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తే అరకిలో బరువు తూగే అవకాశముంది. అయితే సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన రైతు రాఘవేందర్‌రెడ్డి పొలంలో పండిన చిలగడ దుంప ఒకటి ఏకంగా 5 కిలోలకు పైగా బరువు తూగుతోంది. కోతకొచ్చిన పంటను వారం రోజుల కిందట రాఘవేందర్‌రెడ్డి నాగలి సాయంతో దున్నించారు. పొలంలో పండిన ఇతర చిలగడ దుంపలు అరకిలో కంటే తక్కువ బరువున్నాయని ఈ ఒక దుంప మాత్రం 5 కిలోలకు పైగా బరువు ఉందని తెలిపారు. (క్లిక్: ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు..) -
Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక
టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి. ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని స్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి. ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువు తగ్గిస్తుంది. చిలగడదుంపను తింటే ఇక ఆకలి వెయ్యదు. చాలా సేపు అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకేవీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలుంటుంది. నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది. రోజులో కనీసం అరగంట యోగా చేయడం మూలంగా, శరీరంలోని అనేక విషతుల్య మలినాలు తొలగుతాయి. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచగలవు. యోగా ఊపిరితిత్తులను బలపరచడమే కాకుండా, వాటిని శుభ్రపరుస్తుంది. అంతేకాదు, ఒత్తిడికి కూడా దూరంగా ఉండవచ్చు. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
Sweet Potato: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే!
-
Sweet Potato: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే!
ఫిబ్రవరి 22న కుక్ ఎ స్వీట్ పొటాటో డేగా జరుపుకుంటారు. ఓహో.. ఇదో రోజు కూడా ఉందా అని అనుకుంటున్నారా? ఎస్ ఉంది. మరి వెల్.. రూట్ వెజిటబుల్ గా చెప్పుకునే ఈ చిలగడ దుంపకు పెద్ద చరిత్రే ఉంది. వేల ఏళ్ల క్రితమే ఉనికిలో ఉన్న స్వీట్ పొటాటో మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిదట. చిలగడదుంప వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మధ్య అమెరికా లేదా దక్షిణ అమెరికాలో చిలగడ దుంప లేదా స్వీట్ పొటాటో పుట్టిందని భావిస్తున్నారు. ఇవ ఇతర దుంపల కంటే చాలా ఆరోగ్యకరమైనవట. విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. చిలగడ దుంపలు మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ని ఉత్పత్తిచేసే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరరీ, యాన్తోసయానిన్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్, శరీరంలో విటమిన్ Aని తయారుచేయడానికి సహాయపడతాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మన బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది కూడా. విటమిన్ D అధికంగా అతికొద్ది ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. సన్ షైన్ విటమిన్‌గా చెప్పుకునే విటమిన్ డీ చిలగడ దుంపలలో తక్షణమే అందుబాటులో ఉంటుంది. చిలగడ దుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్లన చర్మం మెరుస్తుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మధుమేహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలను తీసుకోవడం మంచిది. గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహా నియంత్రణకు తోడ్పడుతుందని డైటీషియన్స్ చెబుతున్నారు. చిలగడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రక్రియను నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్న మాట. ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మితంగా తింటే, అన్ని రకాల చిలగడదుంపలు ఆరోగ్యకరమేననీ, వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ గనుక డయాబెటిస్-ఫ్రెండ్లీ డైట్లో చేర్చు కోవచ్చని చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
ఈ చిలగడ దుంపలతో కేన్సర్, షుగర్ దూరం!
ఔషధ విలువలు కలిగిన రెండు సరికొత్త చిలగడ దుంప వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఊదా రంగులో ఉండే సరికొత్త చిలగడదుంప (పర్పుల్ స్వీట్ పొటాటో– భూకృష్ణ ) కేన్సర్‌ను, షుగర్‌ను అరికట్టే ప్రత్యేకత కలిగి ఉంది. నారింజ రంగులో ఉండే చిలగడ దుంప (ఆరెంజ్ స్వీట్ పొటాటో–భూసోనా) లో కంటి చూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్ పుష్కలంగా ఉంది. భువనేశ్వర్ (ఒడిశా)లోని కేంద్రీయ దుంప పంటల పరిశోధనా స్థానం(సిటిసిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఏడేళ్లు పరిశోధన చేసి ఈ వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఊదా రంగులో ఉండే 100 గ్రాముల చిలగడ దుంపలో 90–100 గ్రాముల మేరకు ఆంథోశ్యానిన్ వర్ణద్రవ్యం ఉంటుంది. కేన్సర్‌ను అరికట్టే, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించే లక్షణం కలిగిన యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయని సిటిసిఆర్‌ఐ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. నెడుంజెళియన్ చెప్పారు. 100 గ్రాముల నారింజ ‘భూసోనా’ చిలగడ దుంపలో 14 ఎంజిల బీటా–కెరొటిన్ ఉందని, క్యారట్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చన్నారు. అమెరికా, మెక్సికో ప్రాంతాల నుంచి తెప్పించిన రకాలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చేసి, తాము 2 రెండు విశిష్ట వంగడాలను రూపొందించామన్నారు. సాగు విధానం వీటి సాగు కాలం 100–120 రోజులు. ఎర్ర, దుబ్బ నేలలు అనుకూలం. ఈ దుంప పంటలు మంచి దిగుబడి ఇవ్వాలంటే సగటు ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. దుంప పెరిగే కాలంలో రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే మేలు. ఖరీఫ్‌లో వర్షాధారంగా సముద్ర మట్టానికి 400 మీటర్లకన్నా ఎత్తు ఉండే అరకు, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వంగడాలను ఎర్ర, దుబ్బ నేలల్లో సాగు చేయవచ్చు. జూలై 15 వరకు మొక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 12–15 టన్నుల దిగుబడి వస్తుంది. రబీలో మైదాన ప్రాంతాల్లోని ఎర్ర, దుబ్బ నేలల్లో సెప్టెంబర్– అక్టోబర్లలో ఈ మొక్కలు నాటుకోవచ్చు. పంట పూర్తయ్యాక తీగ ముక్కలను సేకరించి నర్సరీ పెంచుకోవచ్చు. దుంప ముక్కలతోనూ మొక్కలను పెంచుకొని నాటుకోవచ్చన్నారు డా. నెడుంజెళియన్. మొక్కలు ఇస్తాం ఖరీఫ్‌లో సాగుకు భూకృష్ణ, భూసోన రకాల చిలగడదుంప మొక్కలు భువనేశ్వర్‌లోని సిటిసిఆర్ఐలో అందుబాటులో ఉన్నాయి. మొక్కలను కొరియర్ ద్వారా పంపటం సాధ్యం కాదు. రైతులు స్వయంగా వచ్చి తీసుకెళ్లాలి. జూలై 15 లోగా నాటుకోవచ్చని డా. నెడుంజెళియన్ చెప్పారు. రబీలో సాగు కోసం అక్టోబర్‌లో మొక్కలు / విత్తన దుంపలు ఇస్తామని, సాగు పద్ధతులనూ తెలుగులోనే వివరంగా చెబుతామన్నారు. ఊదా, నారింజ రంగుల్లోని చిలగడదుంపలకు విదేశాల్లో గిరాకీ ఉంది. మన దేశంలోనూ ఆదరణ పెరుగుతోందని డా. నెడుంజెళియన్ (79784 88514) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. భువనేశ్వర్‌లోని సిటిసిఆర్‌ఐ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. నెడుంజెళియన్ mnedun@gmail.com -
చిలగడదుంప పొట్టుతో సహా తినడం మేలు!
సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి. వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ అనే మరో పోషకం ఈసోఫేగల్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున ఈ పింక్ రంగులో ఉండే పొట్టును ఒలిచిపారేయకుండా తినేయండి. చదవండి: చక్కనమ్మ బరువు పెరిగినా బ్రహ్మాండమే! -
ఈ వర్షాల్లో ఇమ్యూనిటీ పెంచుకోండిలా...
మీకు తరచూ జలుబు చేస్తుంటుందా? అలా కాస్త తగ్గుతుండగానే మళ్లీ ఇలా అది వచ్చేస్తోందా? వర్షాలు పడుతున్న ఇలాంటి సీజన్లో ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. మనందరిలో కాస్త దగ్గు, జలుబూ, రొంపా, జ్వరం కనిపించగానే... అలా మందుల దుకాణానికి వెళ్లడం, ఏదో యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటాం. దీనితో రెండు నష్టాలు. మొదటిది... రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఆ కారణంగా మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జబ్బులు తగ్గకపోవడం. ఇదొక దుష్పరిణామం అయితే... ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రెండో ప్రమాదంగా చెప్పవచ్చు. అందుకే ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తిని సాధించవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు... కొన్ని రకాల దీర్ఘరోగాల నుంచి మంచి ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది. చిలగడ దుంపలు (స్వీట్‌పొటాటో) దీన్నే మోరంగడ్డ/గెణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలూ వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే. ఇక ఇది మేనికి మంచి మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌నుంచి రక్షణ ఇస్తుంది. ఇక ఇందులో ఉండే చక్కెర వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ–రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవననాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు. వర్షాలు విస్తృతంగా పడుతున్న ఈ సీజన్లో ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోడానికి చాలా రుచికరమైన కొన్ని చిట్కాలు. వీటితోపాటు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం, ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటుండటం కూడా బాగా ఉపకరిస్తుంది. చికెన్ సూప్ మీరు మాంసాహారం తినేవారైతే జలుబు, రొంప లాంటి తరచూ సోకే ఇన్ఫెక్షన్లకు కమ్మటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. చికెన్ సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడి పులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో మంచి వ్యాధి నిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్సూప్లోని జిలాటిన్ అనే అమైనోయాసిడ్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు... చికెన్సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి ఇది ఉల్లి జాతికి చెందిన వంట దినుసు. తాను ఘాటుగా ఉండటం మాత్రమే కాదు... ఇది ఎన్నో వ్యాధులపై కూడా అంతే ఘాటు ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక రోగాలను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసిన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. మనం తినే ఆహారాల్లో ఫ్రీ–రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ప్రభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్రీ–రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు ఎన్నో రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు... శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నిమ్మజాతి పండ్లు నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇవి చాలా వ్యాధులకు మంచి రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. అంతేకాదు... కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల వీటిని తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దాంతో చాలా జబ్బులు నివారితమవుతాయి. -
అనారోగ్యాలు గడగడ
చిలగడదుంపను వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొన్నిచోట్ల మోరం గడ్డ అని, మరికొన్ని చోట్ల గెణుసు గెడ్డ అని అంటుంటారు. పేరు మారినా రుచి, పోషకాలు మాత్రం మారవు కదా. అనారోగ్యాలను గడగడలాడించే చిలగడతో సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని. చిలగడదుంపలో పీచు (ఫైబర్) పాళ్లు చాలా ఎక్కువ. అందువల్ల ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. ఇందులోని కొన్ని ప్రత్యేక పోషకాలు డియోడినల్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తాయి. నొప్పినివారణ మందుల వల్ల కడుపులో వచ్చే నొప్పి, మంట వంటి (ఇన్ఫ్లమేటరీ) ప్రభావాలనూ చిలగడదుంప నివారిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు ఎక్కువ. విటమిన్–బి6 హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు హోమోసిస్టిన్ అన్నది ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. ఫలితంగా చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని పరిశోధనల్లో తేలింది.చిలగడదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేసి, అనేక వ్యాధులను నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే తరచు చిలగడ దుంప తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. చిలగడదుంపలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నివారిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి చిలగడదుంప ఎంతో మంచిది. -
తరగని యౌవనం కోసం
చిలగడదుంపకు ప్రాంతాలను బట్టి గెణుసుగడ్డ, మోరంగడ్డ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో 77 శాతం నీరు, 20.1శాతం కార్బోహైడ్రేట్లు, 1.6 శాతం ప్రొటీన్లు, 3 శాతం పీచుపదార్థాలు ఉంటాయి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ∙చిలగడదుంపలో కార్బోహైడ్రేట్ల పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తక్షణ శక్తి వనరుగా ఉపయోగించుకోవచ్చు ∙బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. అలాగే విటమిన్–ఏ మేనికి ఒక మెరుపు, నిగారింపు ఇస్తుంది. అందుకే చిలగడదుంపల్ని తినేవారి చర్మం ఏజింగ్ దుష్ప్రభావాలకు అంత తొందరగా గురికాదు. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది ∙చిలగడదుంపలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. పొటాషియమ్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు దీన్ని తింటే... బీపీ అదుపులో పాటు గుండె ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది ∙ చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవు తాయని పరిశోధనల్లో తేలింది. -
దీర్ఘకాలిక యౌవనాన్ని ఇచ్చే చిలగడదుంప!
చిలగడదుంపను కొన్ని ప్రాంతాల్లో మోరం గడ్డ అనీ, మరికొన్ని చోట్ల గణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చేసే గుణం చిలగడదుంపలో ఉంది. సాధారణంగా చాలా రకాల దుంపలను డయాబెటిస్ రోగులు తీసుకోకూడదని అంటారు. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చిలగడదుంపలను డయాబెటిస్ ఉన్నవారూ పరిమితంగా తీసుకోవచ్చని న్యూట్రిషన్ నిపుణుల మాట. దీంతో ఒనగూనే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... ►చిలగడదుంప చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. దీనిలోనూ విటమిన్–సి పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. ►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం కూడా ఉంది. ఒత్తిడితో పాటు అనేక కారణాలతో ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప సమర్థంగా తొలగిస్తుంది. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. ►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది. అంతేకాదు... ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ►చిలగడదుంపలోని మెగ్నీషియమ్... ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. -
ఇమ్యూనిటీని పెంచే చిలగడదుంప
గుడ్ ఫుడ్ ఉడకబెట్టుకొని తింటే అద్భుతంగానూ, నిప్పుల మీద కాల్చుకుని తింటే పరమాద్భుతంగానూ ఉండే చిలగడదుంప అంటే చాలామందికి ఇష్టమే. వేర్వేరు ప్రాంతాల్లో దీనికి గణుసుగడ్డ, మోరంగడ్డ అంటూ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ దీని విశిష్టతలు ఎక్కువే. ►చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు పుష్కలం. విటమిన్–బి6 అనేది హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు ఈ హోమోసిస్టిన్ కారణమవుతుంది. అంటే చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. ►చిలగడదుంపలో బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. ►చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుందన్నమాట. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. ►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం ఉంది. ఒత్తిడి వల్ల ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప తొలగిస్తుంది. ►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గడంతో పాటు, తగినన్ని ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పాదన జరుగుతుంది. ►ఇందులోని మెగ్నీషియమ్ మన ఒంట్లోని ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.