టేస్టీ టేస్టీ స్వీట్‌ పొటాటో బొబ్బట్లు మీకోసమే..! | Try This Tasty Sweet Potato Parotta. | Sakshi
Sakshi News home page

టేస్టీ టేస్టీ స్వీట్‌ పొటాటో బొబ్బట్లు మీకోసమే..!

Published Sun, Mar 10 2024 2:30 PM | Last Updated on Sun, Mar 10 2024 2:30 PM

Try This Tasty Sweet Potato Parotta. - Sakshi

కావలసినవి:
చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక, తొక్క తీసి.. కొద్దిగా పాలు కలిపి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి)
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు
పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌
నీళ్లు – సరిపడా, బాదం, జీడిపప్పు – 15 చొప్పున
ఏలకులు – 4, నెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు
బొంబాయి రవ్వ – పావు కప్పు
బెల్లం తురుము – అర కప్పు
ఉప్పు – చిటికెడు

తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని 10 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ చిన్నమంట మీద దోరగా వేయించాలి. అందులో చిలగడదుంప పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి.

అనంతరం బెల్లం తురుము వేసుకుని కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు మిశ్రమం వేసుకుని కలపాలి. మరో టీ స్పూన్‌ నెయ్యి వేసుకుని బాగా  తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం గోధుమ పిండి ముద్దను.. చిన్నచిన్న నిమ్మకాయ సైజ్‌ బాల్స్‌లా తీసుకుని.. గిన్నెలా ఒత్తుకుని.. దానిలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని పెట్టుకుని బాల్స్‌లా చుట్టుకోవాలి. వాటిపై కొద్దికొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ.. చపాతీల్లా చేసుకుని.. నేతిలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.

ఇవి చదవండి: మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement