కావలసినవి:
గోధుమ పిండి
ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున
బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున
పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి)
నూనె లేదా బటర్ – పావు కప్పు (బటర్ అయితే కరిగించుకోవాలి)
గడ్డ పెరుగు, వాల్ నట్స్ తరుగు, చాక్లెట్ చిప్స్ – పావు కప్పు చొప్పున
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్ నట్స్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఓవెన్‌లో పెట్టుకుని, బేక్ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.
ఇవి చదవండి: సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..!
Comments
Please login to add a commentAdd a comment