Tasty
-
ఆలియా భట్ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!
ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది. బీట్రూట్ సలాడ్కావలసినవి: తురిమిన బీట్రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.సొరకాయ సబ్జీకావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చియా పుడ్డింగ్ కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్!
ప్రపంచంలోనే అత్యుత్తమ డెజర్ట్‌గా భారతీయ తీపి వంటకానికి చోటు దక్కింది. టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌లో ఈ భారతీయ తీపి వంటకం ఒకటిగా నిలిచింది. ఇంతవరకు ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ బెస్ట్ కూర, బెస్ట్ కాఫీ, బెస్ట్ అల్పహార జాబితాను విడుదల చేసింది. తాజాగా భోజనం తర్వాత హాయిగా ఆస్వాదించే డెజర్ట్(స్వీట్) రెసిపీల జాబితాను విడుదల చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'రసమలై' రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ 'రసమలై' స్వీట్‌ని ఇష్టపడని వారుండరు. దీన్ని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోళీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా ఈ రసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి ఈ తీపి వంటకంగా నిదర్శనంగా అని పలువురు పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్కి తొలి స్థానం దక్కించుకుంది. పోలాండ్‌కు చెందిన సెర్నిక్ అనేది గుడ్లు, చక్కెర ట్వరోగ్తో తయారు చేసే చీజ్ వంటకం. ఇది ఒక రకమైన పెరుగు చీజ్. ఈ చీజ్ సాధారణంగా చిన్న ముక్కలుగా ఉండే కేక్‌లా తయారు చేస్తారు. దీన్ని ఒక్కోసారి బేక్ చేస్తారు లేదా బేక్ చేయకుండానే కూడా చేయొచ్చు. ఇది చూడటానికి స్పాంజ్ కేక్‌లా జెల్లిలా ఉండి పైన ఫ్రూట్స్‌తో అలంకరించి ఉంటుంది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ఈ చీజ్ డెజర్ట్‌ల జాబితాలో జపనీస్ చీజ్,బాస్క్ చీజ్ వంటి ఇతర ప్రసిద్ధ చీజ్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. టేస్టీ అట్టాస్ విడుదల చేసిన ఉత్తమ చీజ్ డెజర్ట్ పూర్తి జాబితా సవివరంగా ఇదే.. 1. సెర్నిక్, పోలాండ్ 2. రసమలై, భారతదేశం 3 3. స్ఫకియానోపిటా, గ్రీస్ 4. న్యూయార్క్ తరహా చీజ్, USA 5. జపనీస్ చీజ్, జపాన్ 6. బాస్క్ చీజ్, స్పెయిన్ 7. రాకోజీ టురోస్, హంగరీ 8. మెలోపిటా, గ్రీస్ 9. కసెకుచెన్, జర్మనీ 10. మిసా రెజీ, చెక్ రిపబ్లిక్ View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో బొబ్బట్లు మీకోసమే..!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక, తొక్క తీసి.. కొద్దిగా పాలు కలిపి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నీళ్లు – సరిపడా, బాదం, జీడిపప్పు – 15 చొప్పున ఏలకులు – 4, నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ – పావు కప్పు బెల్లం తురుము – అర కప్పు ఉప్పు – చిటికెడు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని 10 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ చిన్నమంట మీద దోరగా వేయించాలి. అందులో చిలగడదుంప పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అనంతరం బెల్లం తురుము వేసుకుని కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు మిశ్రమం వేసుకుని కలపాలి. మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం గోధుమ పిండి ముద్దను.. చిన్నచిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్‌లా తీసుకుని.. గిన్నెలా ఒత్తుకుని.. దానిలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని పెట్టుకుని బాల్స్‌లా చుట్టుకోవాలి. వాటిపై కొద్దికొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ.. చపాతీల్లా చేసుకుని.. నేతిలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..! -
ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..!
కావలసినవి: గోధుమ పిండి ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి) నూనె లేదా బటర్ – పావు కప్పు (బటర్ అయితే కరిగించుకోవాలి) గడ్డ పెరుగు, వాల్ నట్స్ తరుగు, చాక్లెట్ చిప్స్ – పావు కప్పు చొప్పున బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్ నట్స్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..! -
దినుసులన్నీ కలిపితే.. ఈ రకరకాల 'రుచి కారము పొడులు' మీకే!
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.' నువ్వుల పొడి.. కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత. తయారీ.. మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది. కొబ్బరి పొడి.. కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది. కరివేపాకు పొడి.. కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ.. బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి. చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి. రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది. గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు. అవిశె గింజల పొడి.. కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది. ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ! -
పిల్లల కోసం రుచికరమైన సమోసా.. చేప తో
కావలసినవి: చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి) కారం – 2 టీ స్పూన్లు గరం మసాలా – 1 టీ స్పూన్ కార్న్ – అర కప్పు (ఉడికించినవి) పసుపు – అర టీ స్పూన్ సోంపు పౌడర్ –1 టీ స్పూన్ ఉప్పు – తగినంత మిరియాల పొడి – అర టీ çస్పూన్ ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) గుడ్డు – 1 గోధుమపిండి – కప్పు మైదాపిండి – 2 కప్పులు ధనియాల పొడి – 2 టీ స్పూన్లు నీళ్లు – సరిపడా కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. (చదవండి: ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..) -
ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఫొటోలో కనిపిస్తున్న చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. ఉత్తర స్పెయిన్‌కి చెందిన విలక్షణమైన ఈ చీజ్ పేరు కాబ్రేల్స్ బ్లూ చీజ్. ఇటీవల ప్రిన్సిపాలిటీ ఆఫ్ అస్ట్యూరీయస్లో జరిగిన స్థానిక చీజ్ ఫెస్టివల్లో 2.2 కిలోల ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని వేలం వేయగా, రూ. 27 లక్షలు ధర పలికి ప్రపంచ రికార్డును కరిగించింది. సాధారణంగా బ్లూ చీజ్‌ని పచ్చి ఆవుపాలతో తయారు చేస్తారు. కానీ ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని మాత్రం మేకపాలు, గొర్రెపాలు కలిపి తయారు చేస్తారట! అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి గుహలలో ఎనిమిది నెలల పాటు నిల్వ చేస్తారు. ‘అందుకే దీనికి ఇంతటి అద్భుతమైన రుచి’ అంటున్నారు చీజ్ ఫెస్టివల్ అతిథులు. (చదవండి: చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!) -
పైనాపిల్, చాక్లేట్, వెనీలా.. నోరూరించే కెవ్వు కేక్స్..
సాక్షి,మంచిర్యాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, ఫ్రూట్స్, నట్స్, డెజర్ట్ సాస్, బటరక్రీమ్, క్యాండీడ్ ఫ్రూట్స్‌తో ఎన్నో రకాల కేక్‌లను త యారు చేసి, ప్రజలకు అందిస్తున్నారు. రుచితో పాటు, ఇట్టే ఆకర్షించేలా పలు ఆకృతులతో పాటు, మనకు నచ్చిన రూపంలోనూ కేక్‌లను తయారు చేసి ఇస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది కేక్‌లను కట్ చేస్తుంటారు. పోటీతత్వంతో హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కేక్‌లను మంచిర్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఒక్కరోజే వేలాది కేక్‌లు అమ్మకా లు సాగితే, సాధారణ రోజుల్లో వందలాది కేక్‌లు అమ్ముడుపోతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు కేక్‌లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలతో సిద్ధం చేస్తున్నారు. రుచిని బట్టి ధరలు పైనాపిల్, బటర్‌స్కాచ్, చాక్లేట్, వెనీలా, బ్లాక్ ఫారెస్ట్, రెడ్విల్వెట్, ఫ్రెష్ఫ్రూట్, చాక్లెట్ చాపర్ చిప్స్, వైట్ ఫారెస్టు, గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ వంటి రకాల కేకులు రూ.500లకు కేజీ నుంచి రూ. 1200ల వరకు లభిస్తున్నాయి. కొత్త వెరైటీతో వస్తున్న గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ కేక్‌లు కేజీకి రూ.1000 నుంచి రూ.1200ల వరకు లభిస్తున్నాయి. ఇక వీటితో పాటు రెగ్యులర్ కేక్‌లు కేజీకి రూ.200ల నుంచి రూ.400ల వరకు లభిస్తుండగా, కూల్ కేక్‌లు రూ.500ల నుంచి రూ.1000ల వరకు లభిస్తున్నాయి. చాలా వెరైటీలు చేస్తున్నాం ప్రజలు కొత్తకొత్త వెరైటీ కేక్‌లను ఇష్టపడుతున్నారు. అందుకే ధర ఎక్కువైనా రుచికరమైన కొత్త వాటిని తయారు చేస్తున్నాం. గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్, చాక్లెట్ చాపర్స్ వంటి లేటెస్ట్ రకాలను తయారు చేస్తున్నాం. వీటి ధర రూ. వెయ్యికి పైగా ఉన్నా, వీటినే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బార్బీ బొమ్మ, బాంబుల రూపంలో ఉన్న కేక్‌లను చేస్తున్నాం. – కొండపర్తి రమేశ్, బేకరీ నిర్వాహకుడు, మంచిర్యాల వెరైటీ కేక్‌లంటే ఇష్టం ఏదైనా శుభసందర్భంలో కేక్‌లను తింటుంటాం. ఎప్పుడో ఒకసారి ఈ కేక్‌లను తింటాం కాబట్టి, వెరైటీ కేక్‌లను తినడం ఇష్టం. అందుకే అప్పుడప్పుడు కొనే కేక్‌లలో వెరైటీగా, కొత్త రుచులతో వచ్చే కేక్‌లను కొంటున్నాం. – మహేందర్, రామకృష్ణాపూర్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
రవ్వ ఉప్మా బాల్స్.. రుచే వేరయా!
రవ్వ ఉప్మా బాల్స్ కావలసినవి: రవ్వ – 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, నూనె – సరిపడా, అల్లం తురుము – కొద్దిగా, నీళ్లు – రెండున్నర కప్పులు, కొబ్బరి కోరు – పావు కప్పు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినపగుళ్లు – 1 టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా రవ్వను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పానలో మూడు టీ స్పూన్ల నూనె వేసుకుని, అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ మరగనివ్వాలి. తర్వాత కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న సైజ్ బాల్స్ చేసుకుని.. పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పెద్ద పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసుకుని, అందులో జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్లు, కరివేపాకు, ఎంచుమిర్చి వంటివి (అభిరుచి బట్టి కావాల్సినవి) వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఉడికిన బాల్స్‌ని అందులో వేసుకుని కాసేపు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ రవ్వ ఉప్మా బాల్స్ సిద్ధమై పోతాయి. ప్రాన్ వడ కావలసినవి: పెద్ద రొయ్యలు – 15 (శుభ్రం చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి) పచ్చి శనగపప్పు – ఒకటిన్నర కప్పులు(నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి) పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 1 ఉల్లిపాయలు – 2 అల్లం – చిన్న ముక్క జీలకర్ర – అర టీ స్పూన్ కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా నిమ్మరసం – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక సారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలకు ఆ మిశ్రమాన్ని దట్టంగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది. కార్న్ కబాబ్స్ కావలసినవి: స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు+ 3 టేబుల్ స్పూన్లు బంగాళదుంపలు – 2, పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు(చిన్న చిన్న ముక్కలుగా తరగాలి), క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్ స్పూన్, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, పసుపు – 1 టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ గరం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్వీట్ కార్న్, బంగాళదుంపల ముక్కలు వేరువేరుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని.. అందులో ఒకటిన్నర కప్పుల స్వీట్ కార్న్, బంగాళదుంప ముక్కలను వేసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, శనగపిండి, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర తురుము, అల్లం పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చిన్ని చిన్ని పరిమాణంలో నచ్చిన షేప్ కబాబ్స్ సిద్ధం చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి. -
అంతా టేస్టీ... అరచేతిలో టోస్టీ
రీచార్జబుల్ టార్జి లైట్లను చూశాం.. రీచార్జబుల్ హెయిర్ డ్రైయర్‌ను చూశాం.. కానీ రీచార్జబుల్ టోస్టర్‌ని చూశారా..? కనీసం వాటి గురించైనా విన్నారా? అంతేకాదు, అలాంటిది ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? వెజిబుల్ టోస్టరే కొత్తగా అనిపిస్తే.. ఈ పోర్టబుల్ టోస్టర్ మరింత కొత్తగా ఉంది కదూ..! అవునండీ.. ఈ రీచార్జబుల్ టోస్టర్‌ను ఇకపై మీ బ్యాగుల్లో వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీకు ఆకలేసిన ప్రతిసారీ బ్రెడ్‌ను అప్పటికప్పుడే టోస్ట్ చేసుకొని తినొచ్చు. జర్నీలో.. ఆఫీసు క్యాంటీన్లో.. ఇలా ఎక్కడైనా రెండు నిమిషాల్లో బ్రెడ్‌ను టోస్ట్ చేసుకోవచ్చు. ఈ టోస్టర్ పైభాగం ఆన్ చేయక ముందు ఖాళీగా కనిపిస్తుంది. కానీ బ్రెడ్ టోస్ట్ అవుతున్నప్పుడు బటర్‌ఫ్లై, పువ్వులు కనిపిస్తాయి. వాటి కదలికలను బట్టి టోస్ట్ అయిందా.. లేదా అన్న సంగతిని తెలుసుకోవచ్చు (బటర్‌ఫ్లై పూల మధ్యకు రాగానే టోస్టర్‌ను ఆఫ్ చేసుకోవాలి). అలాగే దీని అడుగుభాగంలో రంధ్రాలుంటాయి. వాటి ద్వారానే బ్రెడ్ టోస్ట్ అవుతుంది. ఒకసారి టోస్టర్ ఆఫ్ అవగానే వాటంతటవే మూసుకుపోతాయి.