ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్‌నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్‌నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్‌రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది.
బీట్‌రూట్ సలాడ్
కావలసినవి: తురిమిన బీట్‌రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర.
తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్‌రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి.
ఆరోగ్య ప్రయోజనాలు: బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.
సొరకాయ సబ్జీ
కావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.
తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
చియా పుడ్డింగ్
కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా.
తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి.
ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment