ప్రపంచంలోనే అత్యుత్తమ డెజర్ట్‌గా భారతీయ తీపి వంటకానికి చోటు దక్కింది. టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌లో ఈ భారతీయ తీపి వంటకం ఒకటిగా నిలిచింది. ఇంతవరకు ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ బెస్ట్ కూర, బెస్ట్ కాఫీ, బెస్ట్ అల్పహార జాబితాను విడుదల చేసింది. తాజాగా భోజనం తర్వాత హాయిగా ఆస్వాదించే డెజర్ట్(స్వీట్) రెసిపీల జాబితాను విడుదల చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'రసమలై' రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ 'రసమలై' స్వీట్‌ని ఇష్టపడని వారుండరు. దీన్ని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోళీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా ఈ రసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి ఈ తీపి వంటకంగా నిదర్శనంగా అని పలువురు పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్‌కి తొలి స్థానం దక్కించుకుంది.
పోలాండ్‌కు చెందిన సెర్నిక్ అనేది గుడ్లు, చక్కెర ట్వరోగ్‌తో తయారు చేసే చీజ్ వంటకం. ఇది ఒక రకమైన పెరుగు చీజ్. ఈ చీజ్ సాధారణంగా చిన్న ముక్కలుగా ఉండే కేక్‌లా తయారు చేస్తారు. దీన్ని ఒక్కోసారి బేక్ చేస్తారు లేదా బేక్ చేయకుండానే కూడా చేయొచ్చు. ఇది చూడటానికి స్పాంజ్ కేక్‌లా జెల్లిలా ఉండి పైన ఫ్రూట్స్‌తో అలంకరించి ఉంటుంది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ఈ చీజ్ డెజర్ట్‌ల జాబితాలో జపనీస్ చీజ్,బాస్క్ చీజ్ వంటి ఇతర ప్రసిద్ధ చీజ్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. టేస్టీ అట్టాస్ విడుదల చేసిన ఉత్తమ చీజ్ డెజర్ట్ పూర్తి జాబితా సవివరంగా ఇదే..
1. సెర్నిక్, పోలాండ్
2. రసమలై, భారతదేశం 3
3. స్ఫకియానోపిటా, గ్రీస్
4. న్యూయార్క్ తరహా చీజ్, USA
5. జపనీస్ చీజ్, జపాన్
6. బాస్క్ చీజ్, స్పెయిన్
7. రాకోజీ టురోస్, హంగరీ
8. మెలోపిటా, గ్రీస్
9. కసెకుచెన్, జర్మనీ
10. మిసా రెజీ, చెక్ రిపబ్లిక్
(చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment