కావలసినవి: చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)
కారం – 2 టీ స్పూన్లు
గరం మసాలా – 1 టీ స్పూన్
కార్న్ – అర కప్పు (ఉడికించినవి)
పసుపు – అర టీ స్పూన్
సోంపు పౌడర్ –1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – అర టీ çస్పూన్
ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
గుడ్డు – 1
గోధుమపిండి – కప్పు
మైదాపిండి – 2 కప్పులు
ధనియాల పొడి – 2 టీ స్పూన్లు
నీళ్లు – సరిపడా
కొత్తిమీర తురుము – కొద్దిగా
తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి
15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది.
(చదవండి: ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..)
Comments
Please login to add a commentAdd a comment