evening
-
సంధ్యావేళ.. మహా కుంభమేళా
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శనివారం మహాకుంభ్‌లో 42 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల 72 లక్షల మంది మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈ నేపధ్యంలో మహాకుంభ్ నగరానికి చెందిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలలో వేదికలు, టెంట్లు, అద్భుతమైన లైట్లు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపుతిప్పుకోలేనివిగా ఉన్నాయి.ఈ మహాకుంభ్ నగర దృశ్యాలు డ్రోన్ సాయంతో తీసినవి. కుంభ్ ప్రాంతంలో మిరిమిట్లుగొలిపే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో సంగమం దగ్గరున్న అందమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.మహా కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఏర్పాట్లను ఈ చిత్రాలలో వీక్షించవచ్చు. మహాకుంభ నగరం వెలుగుజిలుగుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ హ్యాండిల్లో మహాకుంభ్ నగరపు అందమైన చిత్రాలను షేర్ చేశారు. ఈ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉన్నదన్నారు.మహా కుంభమేళా సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఎంపీ సుధాంశు త్రివేది కూడా పుణ్యస్నానం ఆచరించారు. సంగమంలో స్నానం చేసిన రక్షణ మంత్రి అనంతరం అక్షయవత్, పాతాళపురి, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.జనవరి 22న మహా కుంభమేళాపై సమీక్షించేందుకు యూపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో.. -
ఈవినింగ్ స్నాక్స్ : ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు
వర్షాకాలంలో సాయంత్రంపూట ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే స్కూలు నుంచి పిల్లలు కూడా ఏదో ఒకటి తినడానికి కావాలని మారాం చేస్తూ ఉంటారు. నోటికి రుచిగా ఉండే వెరైటీ స్నాక్స్ కోసం ఆశగా ఎదురు చూసే అత్త మామలు..వీళ్లందర్నీ సంతృప్తి పరచాలంటే.. ఇదిగో ఐడియా!పల్లీ పకోడికావలసినవి: వేరు శనగపప్పు – పావు కిలో (పచ్చివి); శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి– టేబుల్ స్పూన్; మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్)– టీ స్పూన్; మిరపపొపడి– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; చాట్ మసాలా పొడి– టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నీరు – పావు లీటరు (అవసరాన్ని బట్టి వేయాలి); నూనె – వేయించడానికి తగినంత.తయారీ: వేరుశనగపప్పును మెత్తటి వస్త్రంలో వేసి తుడవాలి. ఆ తర్వాత వాటిని ఒక పాత్రలో వేయాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మిరప్పొడి, చాట్ మసాలా, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి మరోసారి సమంగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని వేస్తూ పిండి వేరుశనగపప్పుకు పట్టేటట్లు మిశ్రమాన్ని తడి పొడిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి వేరుశనగపప్పుల మిశ్రమాన్ని చేత్తో తీసుకుని వేళ్లను కదుపుతూ గింజలు విడివిడిగా పడేటట్లు జాగ్రత్తగా నూనెలో వదలాలి. నూనెలో కాలుతున్నప్పుడు చిల్లుల గరిటెతో కలియబెడుతూ లోపల గింజలో పచ్చిదనం పోయి దోరగా వేగే వరకు కాలనిచ్చి తీయాలి. ఇలా మొత్తం పప్పులను వేయించి ఒక పాత్రలో వేయాలి ∙ఇప్పుడు అదే నూనెలో కరివేపాకులు వేసి చిటపటలాడిన తర్వాత తీసి పకోడీ మీద వేసి కలపాలి. ఈ పల్లీ పకోడీ మరీ వేడి ఉన్నప్పుడు తింటే రుచి తెలియదు. వేడి తగ్గిన తరవాత తినాలి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయి.పీ నట్ చాట్కావలసినవి: వేరు శనగపప్పు – కప్పు (వేయించినవి); ఉల్లిపాయ – 1 (తరగాలి); టొమాటో – 1 (తరిగి గింజలు తొలగించాలి); కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మరసం – టీ స్పూన్; మిరప్పొడి– అర టీ స్పూన్; చాట్ మసాలా– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; నూనె– 2 టీ స్పూన్లు.తయారీ: ∙బాణలిలో నూనె వేడి చేసి స్టవ్ ఆపేయాలి. నూనెలో మిరపపొడి, చాట్ మసాలా, వేరుశనగపప్పు వేసి కలపాలి. పప్పు వేడెక్కిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేయాలి. చివరగా నిమ్మరసం చల్లి, ఉప్పు కలపాలి. ఇది అన్ని వయసుల వారికీ మంచి ఆహారం. -
ఆ 3 గంటల్లోనే మృత్యు ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మూడు గంటల్లోనే ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా.. ఈ మూడు గంటల్లోనే 90,663 ప్రమాదాలు జరిగినట్టు నివేదిక తెలిపింది. అదే సమయంలో తెలంగాణలో 4,544 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. కార్యాలయాల పనివేళలు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పలు రకాల పనులపై ఇంటి నుంచి బయటికి వచ్చే వాహనదారులతో రోడ్లు రద్దీగా ఉండటం... సాయంత్రం వేళల్లో సరైన వెలుతురు లేకపోవడం, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తదితర కారణాలతోనే సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు. -
బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..
కావలసినవి: బ్రెడ్ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి) కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో బ్రెడ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. (చదవండి: ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ) -
పిల్లల కోసం రుచికరమైన సమోసా.. చేప తో
కావలసినవి: చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి) కారం – 2 టీ స్పూన్లు గరం మసాలా – 1 టీ స్పూన్ కార్న్ – అర కప్పు (ఉడికించినవి) పసుపు – అర టీ స్పూన్ సోంపు పౌడర్ –1 టీ స్పూన్ ఉప్పు – తగినంత మిరియాల పొడి – అర టీ çస్పూన్ ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) గుడ్డు – 1 గోధుమపిండి – కప్పు మైదాపిండి – 2 కప్పులు ధనియాల పొడి – 2 టీ స్పూన్లు నీళ్లు – సరిపడా కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. (చదవండి: ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..) -
సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ
కావలసినవి: రొయ్యలు – 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ క్యారట్, బీట్రూట్ తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్ చొప్పున బ్రెడ్ స్లైసెస్ – 10 (నాలుగువైపులా అంచులు కట్ చేసి పెట్టుకోవాలి) పాలు – కొద్దిగా ఉప్పు – తగినంత నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా గుడ్లు – 2 (అందులో, కొద్దిగా పాలు కలుపుకోవాలి) తయారీ: ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారట్ తురుము, బీట్రూట్ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకుని.. అందులో మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని కలిపి కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఉడికిన రొయ్యల ముక్కలు వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్కి ఒకవైపు కొద్దిగా రొయ్యల మిశ్రమం పెట్టుకుని.. మిగిలిన మూడు చివర్లకు పాలు రాసి రోల్స్‌లా చేసుకుని, అంచులు ఊడకుండా అతికించాలి. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు ) -
పైనాపిల్ తో నోరూరించే స్వీట్
కావలసినవి: అనాసకాయ ముక్కలు – 3 కప్పులు (మెత్తగా గుజ్జులా చేసుకుని, వడకట్టుకోవాలి) జీడిపప్పు – పావు కప్పు (నానబెట్టి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి) పంచదార పొడి – అర కప్పు చిక్కటి పాలు – 3 కప్పులు కొబ్బరి పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి) ఫుడ్ కలర్ – కొద్దిగా (నచ్చిన కలర్) ఏలకుల పొడి – అర టీ స్పూన్ డ్రైఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పాలు పోసుకుని, గరిటెతో తిప్పుతూ.. చిన్న మంటపైన కాచాలి. తర్వాత అనాస గుజ్జు, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత పంచదార, ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకుని.. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో బర్ఫీలు చేసుకుని.. డ్రైఫ్రూట్స్ ముక్కలతో వాటిపై ఒత్తుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు) -
సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు
కావలసినవి: చిలగడదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు పచ్చిమిర్చి ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా శనగపిండి – పావు కప్పు బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – 1 టీ స్పూన్ చొప్పున నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, చిలగడదుంప గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చిలగడదుంప–గరం మసాలా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌లో బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, బజ్జీల్లా.. కాగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. (చదవండి: కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు.. ) -
అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి!
కావలసినవి: అరటికాయలు – 2 (మీడియం సైజువి, ముందుగా ఉడికించి, తొక్క తీసి, చల్లారాక మధ్యలో గింజల భాగం తొలగించి, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) అటుకులు – అర కప్పు (కొన్ని నీళ్లల్లో నానబెట్టి, పేస్ట్‌లా చేసుకోవాలి), కొత్తిమీర తరుగు – కొద్దిగా జొన్నపిండి – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్ జీడిపప్పులు – 10 (నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి) చాట్ మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి) నూనె – సరిపడా. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్ వేసుకుని దానిలో కారం, చాట్ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల తురుము వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! ) -
జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు?
1960వ దశకంలో అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం కాగానే వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జనం ఆ సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోయేవారు. జనం ఇంతలా భయపడటానికి కారణం జోడియాక్ కిల్లర్. జోడియాక్ ఒక సీరియల్ కిల్లర్‌గా పేరొందాడు. జోడియాక్ అనేది అతని అసలు పేరు కాదు. అది ఆ సీరియల్ కిల్లర్ తనకు తానుగా పెట్టుకున్న మారుపేరు. అమెరికాలో తొలి క్లాసిక్ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన జోడియాక్ ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జనాలను ఒకరి తర్వాత ఒకరిని హత్యచేస్తూ వచ్చాడు. ఈ నరహంతకుడు కొన్నిసార్లు తుపాకీతో కాల్చి, కొన్నిసార్లు కత్తితో పొడిచి జనాలను చంపేవాడు. అయితే ఈ జోడియాక్ కిల్లర్ తాను హత్య చేసిన తర్వాత వార్తాపత్రికలకు ఈ విషయమై లేఖలు పంపేవాడు. అతని ఉత్తరాలు కోడ్ లేదా సంకేత భాష రూపంలో ఉండేవి. వీటిని చదవడం చాలా కష్టంగా ఉండేది. జోడియాక్ తాను రాసే లేఖలలో పోలీసులను దుర్భాషలాడేవాడు. తాను రాసిన లేఖలను ప్రచురించకుంటే మరింత మందిని చంపేస్తానని అదే లేఖలో బెదిరించేవాడు. యువ జంటలే లక్ష్యంగా ఈ సీరియల్ కిల్లర్ మారణకాండ సాగింది. ఈ హంతకుని చేతిలో మొత్తం 37 మంది హతులయ్యారు. అలాగే ఒంటరిగా ఎవరైనా దొరికితే వారిపై దాడి చేసి, చంపేసేవాడు. ఈ నరహంతకుడు సాగించిన ఇలాంటి ఐదు హత్యలను పోలీసులు నిర్ధారించారు. అయితే తాను స్వయంగా 37 మందిని చంపినట్లు ఈ సీరియల్ కిల్లర్ పత్రికలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ది సన్’లోని ఒక నివేదిక ప్రకారం జోడియాక్ కిల్లర్ వార్తాపత్రికలకు రాసిన తన నాల్గవ లేఖలో తన పేరు జోడియాక్ అని పెట్టుకుంటున్నట్లు తెలియజేశాడు. అయితే దీనికి నిర్దిష్ట కారణం తెలియజేయలేదు. క్రైమ్ రికార్డులలో ఈ పేరుతోనే అతని మీద కేసులు నమోదయ్యేవి. కాలిఫోర్నియా పోలీసులతో సహా అమెరికాలోని అన్ని ఏజెన్సీలు, డిటెక్టివ్లు ఎవరికి వారుగా జోడియాక్ కిల్లర్ కోసం వెదికారు. అయితే అతని జాడ ఎవరికీ తెలియరాలేదు. ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. ఈ నేపధ్యంలో జోడియాక్ కిల్లర్ కేసు 2004లో మూసివేశారు. అయితే ఈ కేసు 2007లో తిరిగి తెరిచారు. ఇది కూడా చదవండి: ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం! -
మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ బాస్కెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. గ్రామానికి చెందిన దివంగత ఫిజికల్ డైరెక్టర్ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బాస్కెట్ బాల్ కోర్టు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు పోటీలను పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామారెడ్డి ప్రారంభిస్తారని, విశిష్ట అతి«థిగా వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయ కర్త కవురు శ్రీనివాసు హాజరవుతారని చెప్పారు. -
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'