
కావలసినవి:
అనాసకాయ ముక్కలు – 3 కప్పులు (మెత్తగా గుజ్జులా చేసుకుని, వడకట్టుకోవాలి)
జీడిపప్పు – పావు కప్పు (నానబెట్టి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి)
పంచదార పొడి – అర కప్పు
చిక్కటి పాలు – 3 కప్పులు
కొబ్బరి పొడి – అర కప్పు (అభిరుచిని బట్టి)
ఫుడ్ కలర్ – కొద్దిగా (నచ్చిన కలర్)
ఏలకుల పొడి – అర టీ స్పూన్
డ్రైఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా
తయారీ:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పాలు పోసుకుని, గరిటెతో తిప్పుతూ.. చిన్న మంటపైన కాచాలి. తర్వాత అనాస గుజ్జు, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పొడి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత పంచదార, ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకుని.. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో బర్ఫీలు చేసుకుని.. డ్రైఫ్రూట్స్ ముక్కలతో వాటిపై ఒత్తుకుని సర్వ్ చేసుకోవాలి.
(చదవండి: సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు)
Comments
Please login to add a commentAdd a comment