బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్.. | Tasty Bread Snack For Evening Time | Sakshi
Sakshi News home page

బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..

Published Sun, Oct 29 2023 10:15 AM | Last Updated on Sun, Oct 29 2023 10:15 AM

Tasty Bread Snack For Evening Time - Sakshi

కావలసినవి:  బ్రెడ్‌ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్‌ చొప్పున
ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్‌ చొప్పున
ఎండుమిర్చి  – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్‌ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు (చిన్నగా కట్‌ చేసుకోవాలి)
కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని.. అందులో బ్రెడ్‌ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్‌ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

(చదవండి: ఈ శాండ్‌విచ్‌ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement