ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శనివారం మహాకుంభ్‌లో 42 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల 72 లక్షల మంది మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ నేపధ్యంలో మహాకుంభ్ నగరానికి చెందిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలలో వేదికలు, టెంట్లు, అద్భుతమైన లైట్లు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపుతిప్పుకోలేనివిగా ఉన్నాయి.
ఈ మహాకుంభ్ నగర దృశ్యాలు డ్రోన్ సాయంతో తీసినవి. కుంభ్ ప్రాంతంలో మిరిమిట్లుగొలిపే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో సంగమం దగ్గరున్న అందమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.
మహా కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఏర్పాట్లను ఈ చిత్రాలలో వీక్షించవచ్చు. మహాకుంభ నగరం వెలుగుజిలుగుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ హ్యాండిల్‌లో మహాకుంభ్ నగరపు అందమైన చిత్రాలను షేర్ చేశారు. ఈ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉన్నదన్నారు.
మహా కుంభమేళా సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఎంపీ సుధాంశు త్రివేది కూడా పుణ్యస్నానం ఆచరించారు. సంగమంలో స్నానం చేసిన రక్షణ మంత్రి అనంతరం అక్షయవత్, పాతాళపురి, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
జనవరి 22న మహా కుంభమేళాపై సమీక్షించేందుకు యూపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
Comments
Please login to add a commentAdd a comment