ఫొటోలో కనిపిస్తున్న చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. ఉత్తర స్పెయిన్‌కి చెందిన విలక్షణమైన ఈ చీజ్ పేరు కాబ్రేల్స్ బ్లూ చీజ్. ఇటీవల ప్రిన్సిపాలిటీ ఆఫ్ అస్ట్యూరీయస్‌లో జరిగిన స్థానిక చీజ్ ఫెస్టివల్‌లో 2.2 కిలోల ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని వేలం వేయగా, రూ. 27 లక్షలు ధర పలికి ప్రపంచ రికార్డును కరిగించింది.
సాధారణంగా బ్లూ చీజ్‌ని పచ్చి ఆవుపాలతో తయారు చేస్తారు. కానీ ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని మాత్రం మేకపాలు, గొర్రెపాలు కలిపి తయారు చేస్తారట! అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి గుహలలో ఎనిమిది నెలల పాటు నిల్వ చేస్తారు. ‘అందుకే దీనికి ఇంతటి అద్భుతమైన రుచి’ అంటున్నారు చీజ్ ఫెస్టివల్ అతిథులు.
(చదవండి: చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!)
Comments
Please login to add a commentAdd a comment