cheese
-
ఫేక్ చీజ్ వార్తలను ఖండించిన ప్రముఖ సంస్థ.. కస్టమర్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌పై రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మెక్‌డొనాల్డ్స్ తను తయారుచేస్తున్న బర్గర్లు, నగ్గెట్లలో చీజ్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించినట్లు ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో వెల్లడైంది. దాంతో సంస్థ స్పందిస్తూ వినియోగదారుల ఆరోగ్యమే తమకు ప్రధానమని చెప్పింది. మహారాష్ట్రలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ల్లో చీజ్ వాడడంలేదంటూ చాలా వార్తలు వస్తున్నాయిని వాటిలో నిజం లేదంటూ తెలిపింది. కంపెనీ తయారుచేస్తున్న ఉత్పత్తుల్లో అధిక నాణ్యమైన చీజ్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తమ ఉత్పత్తులు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యను అధికారులకు వివరించినట్లు త్వరలో వారి తుది నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌ను అందించాలన్నదే తమ కంపెనీ లక్ష్యమని ప్రకటనలో చెప్పారు. సంస్థ ఎల్లప్పుడూ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఆహార చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ప్రముఖ కంపెనీకి ‘చీజ్’ తిప్పలు..
అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాడ్స్కు భారత్‌లో ‘చీజ్ బర్గర్లు’ తిప్పలు తెచ్చిపెట్టాయి. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు మార్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది నెల రోజులపాటు విచారణ జరిపి ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్లు, నగ్గెట్లలో వెజిటబుల్ ఆయిల్ వంటి చౌకైన చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని తేల్చింది. మెక్‌డొనాల్డ్స్‌లో అందించే బ్లూబెర్రీ చీజ్కేక్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కంటెంట్ ఉన్నందున వాటిని చీజ్కేక్గా నిర్వచించలేమని ఫుడ్ రెగ్యులేటరీ బాడీ తీర్పు చెప్పింది. మెక్‌డొనాల్డ్ సరైన లేబులింగ్ లేకుండా అనేక వస్తువులలో చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని, తద్వారా నిజమైన చీజ్ తింటున్నట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించింది. అహ్మద్‌నగర్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫుడ్ ఐటమ్స్ పేర్లలో "చీజ్" అనే పదాన్ని వెస్ట్‌లైఫ్ లిమిటెడ్ తొలగించిందని, ఈ మేరకు సవరించిన మెనూను మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిందని డిసెంబర్ 18 నాటి లేఖను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనాన్ని ప్రచురించింది. కేసు అహ్మద్‌నగర్‌కు సంబంధించినది అయినప్పటికీ, దిద్దుబాటు చర్యను జాతీయంగా విస్తరించడం కోసం ఫాస్ట్‌ఫుడ్ చైన్‌పై ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి. -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఫొటోలో కనిపిస్తున్న చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. ఉత్తర స్పెయిన్‌కి చెందిన విలక్షణమైన ఈ చీజ్ పేరు కాబ్రేల్స్ బ్లూ చీజ్. ఇటీవల ప్రిన్సిపాలిటీ ఆఫ్ అస్ట్యూరీయస్లో జరిగిన స్థానిక చీజ్ ఫెస్టివల్లో 2.2 కిలోల ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని వేలం వేయగా, రూ. 27 లక్షలు ధర పలికి ప్రపంచ రికార్డును కరిగించింది. సాధారణంగా బ్లూ చీజ్‌ని పచ్చి ఆవుపాలతో తయారు చేస్తారు. కానీ ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్‌ని మాత్రం మేకపాలు, గొర్రెపాలు కలిపి తయారు చేస్తారట! అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి గుహలలో ఎనిమిది నెలల పాటు నిల్వ చేస్తారు. ‘అందుకే దీనికి ఇంతటి అద్భుతమైన రుచి’ అంటున్నారు చీజ్ ఫెస్టివల్ అతిథులు. (చదవండి: చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!) -
స్నాక్స్ కోసం..చీజ్ కార్న్ రోల్స్ ఇలా చేసుకోండి
చీజ్ కార్న్ రోల్స్ రెసిపికి కావల్సినవి బంగాళ దుంపలు – మూడు; కార్న్ గింజలు – అరకప్పు; చీజ్ – అరకప్పు; వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను; బ్రెడ్ స్లైసులు –నాలుగు; కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్ మసాలా – అరటీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. బంగాళ దుంపలు, కార్న్ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్‌స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్‌స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్‌ను సన్నగా తురిమి పెట్టాలి తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి, సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. -
‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీని విడుదలైన రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏఐ టెక్నాలజీ ముంచుకొస్తుంది. సమీప భవిష్యత్‌లో కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ చాట్బోట్లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ‘మానవాళి మనుగడకు టెక్నాలజీ ముప్పు’ అనే భయం నుంచి కాస్త ఉపశమనం కలిగించే ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోట్ ఫిజ్జా డెలివరీ స్టార్టప్ 500 అమెరికన్ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దివాళా తీసింది. అందుకు కారణం ఏఐ ఆధారిత రోబోట్ టెక్నాలజీ కారణమని తెలుస్తోంది. అమెరికన్ టెక్ మీడియా సంస్థ ‘ది ఇన్ఫర్మేషన్’ కథనం మేరకు..కొన్నేళ్ల క్రితం పిజ్జాలను తయారు చేసేందుకు రోబోట్లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పిజ్జా తయారీ నిర్వాహకుల మదిలో మెదిలింది. కానీ టెక్నాలజీ పరంగా అనే ఒడిదుడుకులు ఎదురువుతాయనే అంచనాతో అనేక సంస్థలు తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేకపోయాయి. అదే సమయంలో 2015లో జుమే (Zume) సంస్థ ఏఐ ఆధారిత రోబోట్‌తో పిజ్జాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర్వహణకోసం ఇన్వెస్టర్ల నుంచి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా సాఫ్ట్ బ్యాంక్ కంపెనీతో సహా, పెట్టుబడిదారులు జుమేలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డారు. వెరసీ 500 మిలియన్ డాలర్లను సమీకరించింది. మార్కెట్లో కృత్రిమ మేధ ఊహించని పురోగతి సాధించినప్పటికీ పిజ్జాను తయారు చేయడంలో విఫలమైంది. పిజ్జా తయారీ కోసం వెన్నను వినియోగించాలి. అయితే, తయారు చేసిన పిజ్జాను ముక్కలు, ముక్కలుగా చేసుకొని తినే సమయంలో అందులోని వెన్న కరిగిపోకుండా, అలాగే జారిపోకుండా నిరోధించేందుకు అనేక కంపెనీలు విఫలమవుతూ వచ్చాయి. వాటిల్లో జుమే ఒకటి. రోబోట్లతో పిజ్జాలను తయారు చేసే సమయంలో తలెత్తే ఈ సమస్యకు జుమే సైతం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఫండింగ్ ఇవ్వడం ఆపేశారు. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సగానికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా, సంస్థ దివాళా తీసింది. ఈ తరుణంలో ప్రస్తుత మార్కెట్లో ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్ధ్యం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని, అందుకు షట్ డౌన్ చేసిన జుమే సంస్థేనని చెబుతున్నారు. అప్పటి వరకు మానవాళి మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు! -
'చీజ్' బడీహై మస్త్ మస్త్!
అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ. 30 నుంచి 300కు పైగా.. మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్నగర్లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది. పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ప్రత్యేక షెడ్.. దాణా.. మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్.. ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్‌కు తరలిస్తే లీటర్‌కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు. బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా.. మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు. ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?
వేసవి కాలం రానేలేదూ అప్పుడే మధ్యాహ్నం ఎండలు దంచేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు శీతాకాలం డ్రెస్సుల కోసం చూసిన కళ్లన్నీ ఇప్పుడు సమ్మర్వేర్ కోసం వెతుకులాట మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న స్వెటర్ ఓ వ్యక్తి కంట పడింది. వార్నీ, ఇది సమ్మర్ స్వెటరా? అని కొన్ని క్షణాలపాటు తత్తరపాటుకు లోనైన అతడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ నెట్టింట ఇప్పుడీ స్వెటర్ హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!) ఇటాలియన్ ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రద కంపెనీ ఓ పసుపు రంగు స్వెటర్‌ను అమ్మకానికి పెట్టింది. అయితే దానికి ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు పెట్టి మరీ అమ్ముతుండటం ప్రత్యేకత. పైగా దాని ధరెంత అనుకుంటున్నారు. ఇంచుమించు 90,656 రూపాయలు. ధరకు దానికి ఏమాత్రం సంబంధం లేనట్లు కనిపిస్తోన్న ఈ స్వెటర్‌ను చూసిన ఓ ట్విటర్ యూజర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఈ స్వెటర్ నాకు స్విస్ చీజ్‌ను గుర్తు చేస్తోంది' అని రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు సైతం 'అవును, అది చీజ్‌ను తలపిస్తోందని లొట్టలేస్తుండగా మరికొందరు మాత్రం అదేమ్ స్వెటర్రా బాబూ' అని విమర్శిస్తున్నారు. 'అయినా చిరిగినట్లు కనిపిస్తోన్న దీనికి అన్ని వేల రూపాయలా?' అని పలువురు నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..) -
తెల్లజుట్టు నివారణకు..
ఉసిరిక కాయ ముక్కలను(ఎండిన వాటిని) రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఈ నీరు కేశాలకు మంచి పోషణనిస్తుంది. తలస్నానం పూర్తయిన తర్వాత చివరిగా ఈ నీటిని జుట్టుకంతటికీ పట్టేటçట్లు తలమీద పోసుకోవాలి. దీని తర్వాత మరిక మామూలు నీటిని పోయకూడదు. అలాగే ఆరనివ్వాలి. తోటకూర ఆకులను కాడలతో సహా గ్రైండ్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కాని శీకాయ వంటి నాచురల్ ప్రొడక్ట్స్‌తో కాని తల రుద్దుకుంటే మంచిది. తోటకూర రసం జుట్టును నల్లబరచడంతోపాటు కేశాల పెరుగుదలకు, మృదుత్వానికి దోహదం చేస్తుంది. -
నెం. వన్ కాయ
రాజుల్లో నెం. 1 ఎవరు? ఇంకెవరు రాజారాముడే. అందుకే లంకాధిపు వైరి వంటి రాజు లేనేలేడన్నారు. మరి మహిళామణుల్లో నెం. 1 ఎవరు? మరింకెవరు... పంకజముఖి సీతే! రుచి ‘సింహాసనం’పై కూర్చోబెట్టగల కాయగూర ఏదంటూ అప్పట్లోఓ సార్వత్రిక ఎన్నిక జరిగిందట. దాంట్లో మన వంకాయదే ఏకగ్రీవ ఎంపికట. అందుకే అది కాస్తా నెం. ‘వన్’ కాయ అయ్యింది. మనం తినడానికి వీలుగా ‘వన్’టకమై వచ్చింది. రుచుల ‘బ్రింజాల’ మాయాజాలంలో పడదాం రండి. బేబీ బ్రింజాల్ స్టఫ్డ్ కర్రీ కావలసినవి చిన్న వంకాయలు – పావు కేజీ; ఆవాలు – అర టీ స్పూన్; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 3 టేబుల్ స్పూన్లు స్టఫింగ్ కోసం జీడి పప్పులు – 5; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్; టొమాటో – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వేయించిన గసగసాలు – పావు టీ స్పూన్; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; వేయించిన ఎండు మిర్చి – 10 తయారీ ∙ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి నాలుగు భాగాలుగా కట్ చేసి (గుత్తివంకాయ కూరకు తరిగే మాదిరిగా) ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ ∙స్టఫింగ్ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. వంకాయల మధ్యలో తగినంత మిశ్రమం ఉంచాలి. ఇలా అన్ని వంకాయలలో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇందులో స్టఫ్ చేసిన వంకాయలను వేసి ఒకసారి కలిపి, కొద్దిసేపు మూత ఉంచాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తరవాత మూత తీసేసి, గరిటెతో జాగ్రత్తగా కలపాలి. వంకాయలు బాగా ఉడికి, మెత్తబడ్డాక, కొత్తిమీర చల్లి దింపేయాలి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. బ్రింజాల్ గ్రిల్డ్ పార్సెల్స్ కావలసినవి: పెద్ద వంకాయలు – 2; మోజరిల్లా చీజ్ – 50 గ్రా.; టొమాటోలు – 4; బచ్చలి ఆకులు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – కొద్దిగా; సాస్ కోసం ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు; వెనిగర్ – ఒక టీ స్పూన్; ఎండబెట్టిన టొమాటో పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్; తయారీ వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి. పల్చగా, పొడవుగా, నిలువుగా తరగాలి. (ముక్కలు నల్లబడకుండా ఉప్పు నీళ్లలోకి తరగాలి)ఒక పెద్ద పాత్రలో నీళ్లు, తగినంత ఉప్పు వేసి స్టౌమీద ఉంచి మరిగించాలి. తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. నీళ్లను పూర్తిగా ఒంపేసి, ముక్కలను పొడి వస్త్రంలో వేసి తడిపోయేవరకు ఆరబెట్టాలి. రెండు వంకాయ ముక్కలను తీసుకుని ఒకదానికి ఒకటి క్రాస్‌గా ఒక ప్లేట్లో అమర్చాలి. వాటి మధ్యలో టొమాటో చక్రాలు ఉంచి, వాటి మీద ఉప్పు, మిరియాల పొడి, బచ్చలి ఆకులు, కొద్దిగా మోజరిల్లా చీజ్ వేసి, ఆ పైన మళ్లీ బచ్చలి ఆకులు, టొమాటో ముక్క ఉంచాలి. రెండు చివరలను వంకాయతో మడతలు వేసి బ్రింజాల్ పార్సెల్స్‌ను మూసేయాలి. వీటిని ఫ్రిజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి. సాస్ తయారీ ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, వెనిగర్, టొమాటో పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. బ్రింజాల్ పార్సెల్స్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, వాటి నిండా సాస్ వేయాలి. పెనం మీద చీజ్ వేసి కరిగాక, ఈ పార్సెల్స్‌ను ఉంచి, రెండు వైపులా కాల్చి తీసేయాలి. (గ్రిల్ చేసుకునేవారు పది నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి) హైదరాబాదీ దమ్ కీ బైగన్ కావలసినవి నూనె – 4 టేబుల్ స్పూన్లు; వంకాయలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూన్ (మసాలా వేయించడానికి) మసాలా పేస్ట్ కోసం కాశ్మీరీ మిర్చి – 8; జీలకర్ర – ఒక టీ స్పూన్; మిరియాలు – ఒక టీ స్పూన్; ఏలకులు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; బిరియానీ ఆకు – ఒక; వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ – 1 (పెద్దది) + 2 (మీడియం సైజువి) ; ఉల్లి తరుగు – ముప్పావు కప్పు; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు తయారీ ∙వంకాయలను చిన్న సైజు ముక్కలుగా తరగాలి. (చిన్న వంకాయలను వాడుతుంటే గుత్తి వంకాయ మాదిరిగా తరగాలి). ∙స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, వంకాయ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి పక్కన ఉంచాలి. ∙మిక్సీలో ముప్పావు కప్పు ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, కాశ్మీరీ ఎండు మిర్చి, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేసి మెత్తగా చేయాలి. ఆ తరవాత వెనిగర్, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జతచేసి మెత్తగా పేస్ట్‌లా చే సి బయటకు తీయాలి. ∙స్టౌమీద బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక, మసాలా ముద్ద వేసి వేయించాలి. పసుపు జత చేసి మసాలా మిశ్రమాన్ని సుమారు పది నిమిషాల పాటు వేయించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక కప్పుడు నీళ్లు పోసి బాగా కలిపాక, తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను జత చేసి, మసాలా ముద్ద పట్టేలా మృదువుగా కలిపి, మూత పెట్టి, ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. వేడి వేyì అన్నంలోకి రుచిగా ఉంటుంది. వంకాయ కాల్చిన పచ్చడి కావలసినవి గుండ్రంగా, పెద్దగా ఉండే వంకాయ వంకాయ – 1; చింతపండు – 50 గ్రా. (తగినన్ని నీళ్లలో నానబెట్టి, చిక్కగా గుజ్జు తీసుకోవాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లు పోపు కోసం ఎండు మిర్చి – 6; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూన్ తయారీ ∙వంకాయను శుభ్రంగా కడిగి, తడి తుడిచి, వంకాయకు నూనె పూసి, స్టౌమీద ఉంచి కాల్చాలి. కాయ మొత్తం కాలి, మెత్తగా అయిన తరవాత దింపేయాలి. చల్లారాక తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని చేతితో మెత్తగా చేయాలి. ఉప్పు, పసుపు జత చేసి బాగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాక, వంకాయ గుజ్జులో వేసి కలపాలి. చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి చేతితో బాగా కలపాలి. టొమాటో తరుగు వేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మంచిది. వంకాయ మసాలా బోండా కావలసినవి చిన్న వంకాయలు – పావు కేజీ; సెనగపిండి – పావు కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాల పొడి – ఒక టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూను; కారం – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూన్; పల్లీల పొడి – ఒక టేబుల్ స్పూన్; వంట సోడా – చిటికెడు; కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వాము – అర టీ స్పూన్; ఉల్లి తరుగు – ఒక కప్పు; పల్చగా తీసిన చింతపండు పులుసు – 2 కప్పులు తయారీ ∙వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి నాలుగు చెక్కలుగా చీల్చాలి. అలా అన్ని వంకాయలను తరిగి పక్కన ఉంచాలి. స్టౌ మీద గిన్నెలో ఉప్పు, చింతపండు పులుసు పోసి, అందులో తరిగిన వంకాయలను వేసి ఉడికించాలి. పక్కన స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసేయాలి. అందులో కొబ్బరి తురుము, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసంలో ఉడికిన వంకాయలను బయటకు తీసి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము మిశ్రమాన్ని వంకాయలలో స్టఫ్ చేయాలి. ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, వాము, వంట సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. స్టఫ్ చేసిన వంకాయలను సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో బోండాలు వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. నూనెలో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసి వేడివేడిగా అందించాలి. -
చిక్కిపోయిన చీనీ
- ధర భారీగా పతనం - పెట్టుబడులూ రాని దైన్యం - ఈ సీజన్లో రూ.400 కోట్ల వరకు నష్టం - లబోదిబోమంటున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్ : + ఈ రైతు పేరు టి.వెంకటనాయుడు, బత్తలపల్లి మండలం యర్రాయపల్లి. రెండెకరాల్లో చీనీ తోట వేశాడు. బోర్లు ఎండిపోవడంతో కొత్తగా వేయించడానికి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేదు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి చెట్లను బతికించుకున్నాడు. రెండు విడతలుగా 6.50 టన్నుల వరకు చీనీకాయలు పండించాడు. అనంతపురం మార్కెట్‌కు తీసుకురాగా మొదటిసారి టన్ను రూ.13 వేలు, మరోసారి రూ.16 వేలు పలికింది. అంతా కలిపి రూ.లక్ష లోపు వచ్చింది. ఇతను కొత్తగా బోర్లు వేయించడానికి రూ.3 లక్షలు, ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.90 వేలు, పంట పెట్టుబడి కింద రూ.లక్ష వరకు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రూ.5 లక్షలు వెచ్చించగా చేతికి వచ్చింది రూ.లక్ష మాత్రమే. + ఈ రైతు పేరు రామచంద్ర. ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి. ఆరెకరాల్లో చీనీ తోట వేశాడు. ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. ధర లేక కాయలు తెంపలేకపోతున్నారు. టన్ను కనీసం రూ.30 వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో నెల రోజులుగా ఎదురుచూస్తున్నాడు. రామచంద్రతో పాటు కనగానపల్లి మండలం బద్దలాపురం, నరసంపల్లి, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు తదితర మండలాలకు చెందిన పలువురు రైతులు కూడా అనంతపురం మార్కెట్‌కు రావడం, ధర గురించి తెలుసుకుని నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది. సంప్రదాయ పంటలు జిల్లా రైతులకు వరుస నష్టాలను తెచ్చిపెడుతున్నా ఉద్యాన తోటలు అంతోఇంతో ఆదుకునేవి. అయితే..అవి కూడా ఈ సారి రైతులను కష్టాల్లోకి నెట్టేశాయి. చీనీ, మామిడి, అరటి, కళింగర లాంటి వాటికి ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేక దిక్కులు చూస్తున్నారు. వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భజలాలు సగటున 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో చీనీ తోటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే పది వేల ఎకరాల్లో తోటలను వదిలేశారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో పోరాటం సాగిస్తున్న రైతన్నకు.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం శరాఘాతం మారింది. ధరలు పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐదారేళ్లతో పోల్చుకుంటే ఈ సారి చీనీ ధరలు గణనీయంగా పడిపోయాయి. టన్ను కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.16 వేలు పలుకుతోంది. సరాసరి రూ.13 వేలు ఉంది. గతేడాది ఇదే సమయంలో టన్ను కనిష్టం రూ.38 వేలు, గరిష్ట ధర రూ.52 వేలు ఉండేది. సరాసరి ధర రూ.45 పలికింది. నేరుగా తోటల్లో అయితే గరిష్టంగా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పలికినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కొనేవారు లేక, ధర పతనమై పక్వానికి వచ్చిన కాయలను తెంపడానికి రైతులు వెనకాడుతున్నారు. ఈ సమయంలో రోజూ అనంతపురం మార్కెట్‌యార్డుకు 20 నుంచి 30 లారీల సరుకు వస్తుండగా.. ఇప్పుడు ఐదారు లారీలకు మించడంలేదు. ఇక్కడికి తీసుకొస్తున్న కొందరు రైతులు ధర లేక చీనీకాయలను మార్కెట్లోనే వదిలేస్తున్నారు. గత రెండు నెలలుగా ధరల్లో మార్పు లేకపోవడంతో చీనీ రైతులకు ఈ సీజన్లో రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మనుగడ కోసం పోరాటం జిల్లా వ్యాప్తంగా 44 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఎండుతున్న తోటలు, మరోవైపు గిట్టుబాటు లేక రైతులు సతమతమవుతున్నారు. ఈ సీజన్లో కాపునకు వచ్చిన తోటలు 28- 30 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. గార్లదిన్నె, శింగనమల, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, పెద్దపప్పూరు, ముదిగుబ్బ, పామిడి, కూడేరు, బుక్కరాయసమద్రం మండలాల్లో భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. మరో 40 మండలాల్లో కూడా కొద్దిమేరకు సాగు చేస్తున్నారు. ఏటా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. ఏడాదికి రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతోంది. ఈసారి ధర పతనం కావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం స్పందించి చీనీకి గిట్టుబాటు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సెల్ఫీ... సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. సెల్ఫీ. .సెల్ఫీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ఈ 21వ శతాబ్దాన్ని తన మాయలో ముంచేసి, ప్రధానుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ తమ ఆనందాలను పెంచుకునేలా చేస్తోంది ఈ సెల్ఫీ. అయితే కొన్ని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకునేటప్పుడు క్లిక్ బటన్‌పై వేలితో నొక్కడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అసౌకర్యాన్ని తగ్గించేలా.. కేవలం సెల్ఫీ తీసుకునేందుకు అనుగుణంగా మొబైల్‌ను ఉంచి కేవలం ‘క్యాప్చర్’ లేదా ‘ఛీజ్’అని ఆర్డరేస్తే చాలు దానంతట అదే సెల్ఫీ తీసుకునే మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఐరిస్ ఎక్స్ 1 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ ఇబ్బందులను తగ్గించేందుకు వాయిస్ ఫోటో కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో సెల్ఫీలు మరింత సులువు కానున్నాయి. -
సర్వం కల్తీమయం
ఆదిలాబాద్ రిమ్స్ : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. మార్కెట్లో లభించే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. తినే తిండిలో.. తాగే పాలల్లో.. వాడే దినుసుల్లో.. ఇలా.. సర్వం కల్తీమయమే. కళ్లకు కనిపించని విధంగా కల్తీ చేస్తున్నారు. దీంతో మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది స్వచ్ఛమైనదో చెప్పలేని పరిస్థితి ఉంది. కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థం వ్యక్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపే ప్రమాదముంది. అయితే కొంత అప్రమత్తత, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కల్తీని గుర్తించడం సాధ్యమే. ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా.. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కల్తీ జరిగే వస్తువులు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, కల్తీని గుర్తించే విధానంపై కథనం.. నూనెలు.. కొబ్బరి నూనెలో ఆముదం కలిపి కల్తీ చేస్తారు. ఆముదం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కానీ.. కొబ్బరి నూనె కంటే ఆముదం ధర తక్కువ ఉండడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గుర్తించడం ఇలా.. : ప్రయోగశాలల్లో అయితే రసాయనాలతో పరీక్షిస్తారు. అదే ఇంటి దగ్గరైతే చేతితో పట్టుకున్నప్పుడు బాగా జిడ్డుగా ఉన్నట్లయితే ఆముదం కలిపినట్లుగా గురించొచ్చు. కారం.. కారం ఎర్రగా ఆకర్షణీయంగా ఉండడానికి కొన్ని రకాల రంగులు కలుపుతారు. రంపపు పొట్టుతోనూ కల్తీ చేస్తారు. దీనివల్ల ఎలర్జీ, నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక కూర పొడుల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు. ధనియాల పొడిలో ఎక్కువ ఉప్పు కలుపుతారు. గుర్తించడం ఇలా.. : రెండు గాజు పాత్రల్లో నీళ్లు తీసుకుని కారం, ధనియాల పొడిని చెంచా చొప్పున వేయాలి. కల్తీ జరిగి ఉంటే రంపం పొట్టు నీటిపై తేలుతుంది. ఇటుక పొడి వంటివి అడుగున పేరుకుంటాయి. ఇలా కాకుండా నీటిలో కలిసిపోతే అవి స్వచ్ఛమైనవని గుర్తించాలి. నెయ్యి.. స్వచ్ఛమైనదని మురిసిపోతూ మనం తెచ్చుకునే నెయ్యిలో ఎక్కువ భాగం వనస్పతి కలుపుతున్నారు. వనస్పతి వంటి నెయ్యి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుర్తించడం ఇలా.. : ఐదు మిల్లీలీటర్ల నెయ్యిలో 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోమిక్ ఆమ్లం కలపండి. కొద్దిగా చక్కెర చేర్చండి. అప్పుడు నెయ్యి ఇటుక రంగులోకి, ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. కాఫీ పొడి.. కాఫీ పొడిలో సాధారణంగా వేయించిన ఈత గింజల పొడి, చింత గింజల పొడి కలిపి కల్తీ చేస్తుంటారు. గుర్తించడం ఇలా..: కొంచెం కాఫీ పౌడర్‌ను నీళ్లలో వేస్తే.. మంచిదైతే పైన తేలుతుంది. లేదంటే అడుగున పేరుకుపోతుంది. కందిపప్పులో కేసరి.. కందిపప్పులో కేసరి పప్పు (లంకపప్పు ) కలిపి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కందిపప్పులో కలిపే గడ్డిశెనగ పప్పు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. గుర్తించడం ఇలా.. : కొద్దిగా కందిపప్పు తీసుకొని నీళ్లలో పది నిమిషాలు ఉంచాలి. నీరు రంగు మారితే కల్తీ జరిగినట్లే. తేనె.. మార్కెట్లో సీలు లేకుండా పెద్దపెద్ద సీసాల్లో తేనె అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా బెల్లం పానకమే ఉండే అవకాశం ఉంది. గుర్తించడం ఇలా.. : ముందుగా శుభ్రమైన వస్త్రం ముక్కను మీరు కొన్న తేనెలో కలిపి అగ్గిపుల్లతో వెలిగించండి. స్వచ్ఛమైన తేనె అయితే మంట పెరుగుతుంది. లేదంటే కొంచెం కాలిన తర్వాత ఆరిపోతుంది. లేదా గాజు పాత్రలో నీళ్లు తీసుకొని అందులో చెంచా తేనె వేయండి. పాకం అయితే కరిగిపోయి నీటి రంగులోకి మారుతుంది. అదే స్వచ్ఛమైన తేనె అయితే వేసినచోటే అలా ముద్దలా ఉండిపోతుంది. పాలు.. పాలు చిక్కగా కనిపించడం కోసం బియ్యం పిండి గంజి కలుపుతారు. ఇలా చేస్తే చూడడానికి చిక్కగా ఉంటాయి. ఆరోగ్యపరంగా నష్టం కలగకపోయినా ఆర్థికంగా నష్టమే. ఇలా గుర్తించాలి..: చిన్న పాత్రలో కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానికి నాలుగైదు చుక్కల అయోడిన్ కలపాలి. అప్పుడు పాలు నీలి రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. చక్కెర.. చక్కెరలో ఎక్కువ బొంబాయి రవ్వ కలిపి కల్తీ చేస్తారు. గుర్తించడం ఇలా.. : పాలు లేదా నీళ్లలో చెంచా చక్కెర వేయాలి. అందులో రవ్వ కలిపి ఉంటే అడుగున తెల్లని పొర ఏర్పడుతుంది. కోవా, జున్ను, పాలపొడి.. కోవా, జున్నుల్లో బియ్యం పిండితో కల్తీచేస్తారు. పాల పొడిలోనూ బియ్యం పిండి కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా జున్ను తీసుకుని అయోడిన్ కలపాలి. నీలం రంగు కనిపిస్తే అందులో బియ్యం పిండి కలిపినట్లే. వక్కపొడి.. వక్కపొడిలో రంపపు పొట్టు కలుపుతారు. వీటికి ముదురు రంగలనూ కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా వక్కపొడి చేతిలో తీసుకుని గట్టిగా నలిపితే రంగు అంటుకుంటే కల్తీ జరిగిందని భావించాలి. లేదా నీటిలో వేసి చూసినా రంగు వెంటనే కరిగిపోతుంది. నీళ్ల రంగు మారుతుంది. -
పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు'
డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ ఉద్యోగులందరూ స్వీట్లు, చాకొలెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే టబ్బుల కొద్దీ పాలల్లో సరిగంగ స్నానాలు చేయడం ఇప్పుడు రష్యాలోని ఒక చీజ్ ఫ్యాక్టరీ కొంప ముంచేసింది. ఉద్యోగులు స్నానాలు చేయడమే కాదు, తమ పాలజలకాలాటను వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టేశారట. అదిప్పుడు ప్రపంచమంతా చూసేసింది. కంపెనీ ఉత్పత్తులు కొనడానికి ఇక ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు సైబీరియా ప్రాంతంలోని ఓమ్స్క్ అనే చోట ఉన్న ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రష్యన్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. 'ఈ పాలతోనే కంపెనీ పాలుత్పత్తులను తయారు చేస్తోందన్నది నిజం. కాబట్టి విచారణ చేసి దోషులను శిక్షించడం తప్పనిసరి.' అని ఒక అధికారి ప్రకటించాడు. ఆరుగురు ఉద్యోగులు షార్ట్ర్ తప్ప మరేమీ లేకుండా ఈ పాల తొట్టిలో మునిగి తేలుతూ విక్టరీ సింబల్ ను చూపిస్తున్న వీడియోలను యూట్యూబు లో మూడు లక్షల మంది చూశారు. ఓమ్స్క్ చీజ్ కంపెనీ ఏటా 49 టన్నుల చీజ్ ను తయారు చేసి అమ్ముతుంది. ఇప్పుడు ఈ జలకాలాట ఫ్యాక్టరీ యజమానికి ప్రాణసంకటంగా మారింది.