ఉసిరిక కాయ ముక్కలను(ఎండిన వాటిని) రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఈ నీరు కేశాలకు మంచి పోషణనిస్తుంది. తలస్నానం పూర్తయిన తర్వాత చివరిగా ఈ నీటిని జుట్టుకంతటికీ పట్టేటçట్లు తలమీద పోసుకోవాలి. దీని తర్వాత మరిక మామూలు నీటిని పోయకూడదు. అలాగే ఆరనివ్వాలి.
తోటకూర ఆకులను కాడలతో సహా గ్రైండ్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కాని శీకాయ వంటి నాచురల్ ప్రొడక్ట్స్‌తో కాని తల రుద్దుకుంటే మంచిది. తోటకూర రసం జుట్టును నల్లబరచడంతోపాటు కేశాల పెరుగుదలకు, మృదుత్వానికి దోహదం చేస్తుంది.
తెల్లజుట్టు నివారణకు..
Published Sun, Jan 20 2019 1:32 AM | Last Updated on Sun, Jan 20 2019 1:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment