మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌పై రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మెక్‌డొనాల్డ్స్ తను తయారుచేస్తున్న బర్గర్లు, నగ్గెట్లలో చీజ్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించినట్లు ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో వెల్లడైంది. దాంతో సంస్థ స్పందిస్తూ వినియోగదారుల ఆరోగ్యమే తమకు ప్రధానమని చెప్పింది.
మహారాష్ట్రలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ల్లో చీజ్ వాడడంలేదంటూ చాలా వార్తలు వస్తున్నాయిని వాటిలో నిజం లేదంటూ తెలిపింది. కంపెనీ తయారుచేస్తున్న ఉత్పత్తుల్లో అధిక నాణ్యమైన చీజ్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తమ ఉత్పత్తులు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యను అధికారులకు వివరించినట్లు త్వరలో వారి తుది నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌ను అందించాలన్నదే తమ కంపెనీ లక్ష్యమని ప్రకటనలో చెప్పారు. సంస్థ ఎల్లప్పుడూ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఆహార చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment