ఆగ్రాలోని హోటల్ గ్రాండ్ మెర్కూర్ బృందంతో కలిసి శరణ్‌దీప్ సింగ్ గతేడాది నవంబర్‌లో అతిపెద్ద బర్గర్‌ని తయారు చేశారు. బహుశా ఇదే అతిపెద్ద బర్గర్ అయ్యి ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడూ ఆ విషయాన్ని ప్రముఖ ఎన్జీవో వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిందని సదరు హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు. పాశ్చాత్య వంటాకాన్ని కూడా పోషకాలతో కూడిన ఆహారంగా తయారు చేయొచ్చని ప్రూవ్ చేశారు.
ఈ బర్గర్ తయారు చేసేందుకు మిల్లెట్స్‌తో తయరు చేసిన 20 కిలోల బన్స్, ఆరు కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్, 5 కిలోల టమోటాలు, 5 కిలోల దోసకాయ, 5 కిలోల వెడ్జెస్, 12 కిలోల వివిధ రకాల మాయో / సాస్‌లు, 10 కిలోల పనీర్ 10 కిలోల బంగాళదుంప పట్టీలు, 5 కిలోల పాలకూర, 9 కిలోల టిన్ ఫుడ్, 4 కిలోల మసాలా వంటి ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించింది బర్గర్ చచ్చుగా పిలిచే శరణ్‌దీప్ సింగ్. ఆయన ఈ బర్గర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మిల్లెట్స్ ప్రోత్సహించేందుకు తయారు చేసినట్లు తెలిపారు.
ఈ బర్గర్‌లో బన్స్ కోసం తాను జొన్న, బజ్రా, రాగి వంటి తృణ ధాన్యాల పిండిను వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శరణ్‌దీప్ సింగ్ తయారు చేసిన బర్గరే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ లీఫ్ బర్గర్‌గా నిలవడం విశేషం. ఇది పూర్తిగా మిల్లెట్స్, తాజా కూరగాయలతో నిండి ఉంది. అతేగాదు పాశ్చాత్య వంటకాన్ని కూడా ఎలా ఆరోగ్యకరంగా పోషకమైన పద్ధతిలో ఆస్వాదించొచ్చు తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ భారీ బర్గర్‌ని 200 మందికి పైగా పాఠశాల పిల్లలకు అందించినట్లు ఆ ఆగ్రా హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు
శరణ్‌దీప్ 2017 నుంచి 7 కిలోల బర్గర్‌ని తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆయన 2018లో 15 కిలోల బర్గర్, 2019లో 20 కిలోల బర్గర్‌ని తయారు చేశారు. అలాగే అతను క్రికెటర్ హర్భజన్ సింగ్ కోసం 25 కిలోల బర్గర్‌ను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2022లో హోషియార్‌పూర్‌లోని తన సిక్స్ బై 10 బర్గర్ రెస్టారెంట్‌లో 45 కిలోల వెజ్జీ బర్గర్‌ను తయారు చేశారు.
(చదవండి: ఆకుపచ్చ కూరగాయాలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ఇలా చేయండి..!)
Comments
Please login to add a commentAdd a comment