Veggie prices
-
అదో గిగా బర్గర్... ప్రపంచ రికార్డు కొట్టేసింది!
ఆగ్రాలోని హోటల్ గ్రాండ్ మెర్కూర్ బృందంతో కలిసి శరణ్‌దీప్ సింగ్ గతేడాది నవంబర్‌లో అతిపెద్ద బర్గర్‌ని తయారు చేశారు. బహుశా ఇదే అతిపెద్ద బర్గర్ అయ్యి ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడూ ఆ విషయాన్ని ప్రముఖ ఎన్జీవో వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిందని సదరు హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు. పాశ్చాత్య వంటాకాన్ని కూడా పోషకాలతో కూడిన ఆహారంగా తయారు చేయొచ్చని ప్రూవ్ చేశారు. ఈ బర్గర్ తయారు చేసేందుకు మిల్లెట్స్‌తో తయరు చేసిన 20 కిలోల బన్స్, ఆరు కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్, 5 కిలోల టమోటాలు, 5 కిలోల దోసకాయ, 5 కిలోల వెడ్జెస్, 12 కిలోల వివిధ రకాల మాయో / సాస్‌లు, 10 కిలోల పనీర్ 10 కిలోల బంగాళదుంప పట్టీలు, 5 కిలోల పాలకూర, 9 కిలోల టిన్ ఫుడ్, 4 కిలోల మసాలా వంటి ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించింది బర్గర్ చచ్చుగా పిలిచే శరణ్‌దీప్ సింగ్. ఆయన ఈ బర్గర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మిల్లెట్స్ ప్రోత్సహించేందుకు తయారు చేసినట్లు తెలిపారు. ఈ బర్గర్లో బన్స్ కోసం తాను జొన్న, బజ్రా, రాగి వంటి తృణ ధాన్యాల పిండిను వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శరణ్‌దీప్ సింగ్ తయారు చేసిన బర్గరే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ లీఫ్ బర్గర్‌గా నిలవడం విశేషం. ఇది పూర్తిగా మిల్లెట్స్, తాజా కూరగాయలతో నిండి ఉంది. అతేగాదు పాశ్చాత్య వంటకాన్ని కూడా ఎలా ఆరోగ్యకరంగా పోషకమైన పద్ధతిలో ఆస్వాదించొచ్చు తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ భారీ బర్గర్‌ని 200 మందికి పైగా పాఠశాల పిల్లలకు అందించినట్లు ఆ ఆగ్రా హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు శరణ్‌దీప్ 2017 నుంచి 7 కిలోల బర్గర్‌ని తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆయన 2018లో 15 కిలోల బర్గర్, 2019లో 20 కిలోల బర్గర్‌ని తయారు చేశారు. అలాగే అతను క్రికెటర్ హర్భజన్ సింగ్ కోసం 25 కిలోల బర్గర్‌ను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2022లో హోషియార్‌పూర్‌లోని తన సిక్స్ బై 10 బర్గర్ రెస్టారెంట్లో 45 కిలోల వెజ్జీ బర్గర్‌ను తయారు చేశారు. (చదవండి: ఆకుపచ్చ కూరగాయాలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ఇలా చేయండి..!) -
అదిరిపోయే గాడ్జెట్..కాలుష్యాలు ఖతం!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్ పరిశోధకుడు కాయ్ జియా ఈ పోర్టబుల్ ఫుడ్ క్లీనర్‌ను రూపొందించారు. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. -
‘బ్రేవ్’ కాదు.. ‘బేర్’మనాల్సిందే
అమలాపురం :రగిలే ఎండలు జీవనాన్ని దుర్భరం చేస్తుండగా మండే నిత్యావసర వస్తువుల ధరలు జిహ్వకు రుచుల ను దూరం చేస్తున్నాయి. కూరగాయ లు, మాంసం, చేపలు, బియ్యం.. ఇ లా.. సాపాటుకు సంబంధించిన ప్రతి దినుసు ధరా సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంతో పూట గడవడం భారమవుతోంది. జిహ్వ తృప్తి చెందే లా తిని, ‘బ్రేవ్’మని తేన్చాలంటే శక్తికి మించిన పనవుతోంది. కూరగాయ ధ రలు మార్కెట్లో తారాజువ్వల్లా దూ సుకుపోతున్నాయి. రెండు నెలల క్రి తం కేజీ రూ.పది ఉన్న ఉల్లి ధర మడికి హోల్‌సేల్ మార్కెట్లో ప్రస్తుతం రూ.25 వరకు ఉండగా, మార్కెట్లో రూ.33 నుంచి రూ.35 వరకు పెరిగిం ది. పచ్చిమిర్చి ధర మడికిలో రూ.40 ఉంటే, మార్కెట్లో రూ.60 వరకు ఉంది. అల్లం ధర మడికిలో రూ.120 ఉండగా, మార్కెట్లో రూ.150 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో బీరకాయ ధర కేజీ రూ.40 వరకు ఉంది. వీటితోపాటు టమాటా కేజీ రూ.32 పలుకుతోంది. ‘ముక్క’ ప్రియులకు ఇక్కట్లే.. మేక, కోడి మాంసం, చేపలు, రొయ్య ల ధరలు పెరిగిపోవడంతో ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రి యుల జిహ్వకు గడ్డుకాలం దాపురిం చింది. మేక మాంసం ధర కేజీ రూ. 400 వరకు పెరిగిపోవడంతో సామాన్యులు వంద గ్రాముల లెక్కన కొనుగో లు చేస్తున్నారు. కోడి బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.100 ఉండగా, మాంసం కేజీ రూ.200 వరకు చేరింది. గ్రామీణులు ఎక్కువగా తినే లేయర్ కోడి లైవ్ధర కేజీ రూ.74 ఉండగా, మాంసం ధర రూ.150కు పెరిగింది. కోడిగుడ్డు చిల ్లర ధర రూ.4.50. చేపలు, రొయ్యల ధరలూ భారీగానే ఉన్నాయి. గత నెల లో ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోతే కేజీ రూ.ఐదుకు తెగనమ్మారు. ఇప్పుడది రూ.90కి చేరింది. బహిరంగ మార్కెట్లో మాత్రం శీలావతి, బొచ్చు, గడ్డిమోసుల కేజీ ధర రూ.140 నుంచి రూ.150 వరకు ఉంది. చందువా, కొర్రమీను కేజీ రూ.300 వరకు పలుకుతున్నాయి. వెనామీ రొయ్యలే కాదు.. సేక (తెల్ల) రొయ్యల ధర సైతం కేజీ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది. బియ్యం ధర వింటే భయం.. బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగాయి. సన్నరకాల ధరలు గత రెండు నెలల్లో కేజీకి బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.ఐదు నుంచి రూ.ఏడు వరకు పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.45 వరకు ఉన్న గిద్దమసూరి (రారైస్) కేజీ రూ.50 నుంచి రూ.52 వరకు పెరిగింది. గిద్దమసూరు స్టీమ్ రకాలను చాలా కంపెనీలు భారీగా పెంచివేశాయి. రూ.33 ఉన్న స్టీమ్ రకం ధరలు రూ.41 నుంచి రూ.46 వరకు పెరిగాయి. గిద్దమసూరిలోని పండారు రకాలు రూ.34 వరకు ఉంది. సామాన్యులు ఎక్కువ గా కొనుగోలు చేసే స్వర్ణ బియ్యం ధర సైతం పెరిగింది. ధాన్యానికి డిమాండ్ ఏర్పడిందనే వంకతో కేజీ రూ.24 ఉన్న ధరను రూ.26 వరకు పెంచారు. బస్తాకు రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.