అదిరిపోయే గాడ్జెట్‌..కాలుష్యాలు ఖతం! | Portable Food Cleaner Uses Cleanse Your Fruits And Veggies | Sakshi
Sakshi News home page

అదిరిపోయే గాడ్జెట్‌..కాలుష్యాలు ఖతం!

Published Sun, Sep 4 2022 10:31 AM | Last Updated on Sun, Sep 4 2022 10:34 AM

Portable Food Cleaner Uses Cleanse Your Fruits And Veggies - Sakshi

అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్‌ పరిశోధకుడు కాయ్‌ జియా ఈ పోర్టబుల్‌ ఫుడ్‌ క్లీనర్‌ను రూపొందించారు. 

కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్‌ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. 

దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్‌ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్‌ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement