cleaner
-
మార్కెట్లోకి కొత్తరకం ఫ్లోర్ క్లీనర్.. చార్జ్ పెడితే చాలు!
తడి, పొడి చెత్తను ఏక కాలంలో తొలగించి ఫ్లోర్‌ను పరిశుభ్రం చేసే ప్రత్యేకమైన కార్డ్-ఫ్రీ వెట్ ఫ్లోర్ క్లీనర్‌ను డైసన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరు డైసన్ వాష్జీ1. పరిశుభ్రమైన శుభ్రత, నిర్వహణ కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త రకం ఫ్లోర్ క్లీనర్ ధర రూ. 64,900.వాష్జీ1 ఫ్లోర్ క్లీనర్ ఒక లీటర్ ట్యాంక్‌తో వస్తుంది. తడి, పొడి చెత్తను ఒకేసారి శుభ్రం చేయడానికి హైడ్రేషన్, శోషణ, ఎక్స్ట్రాక్షన్ పద్ధతుల కలయికను ఉపయోగిస్తుంది. ఇది ఒక ఛార్జ్‌లో 3100 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ క్లీనర్‌ను దేశం అంతటా డైసన్ వెబ్సైట్లో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో డైసన్ డెమో స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. -
ఈ టీత్ క్లీనర్ ఉంటే..ముత్యాల్లాంటి పలువరుస మీ సొంతం!
ముత్యాల్లాంటి పలువరుస ముఖానికి ఎనలేని అందాన్ని తీసుకొస్తుంది. నవ్వినా.. మాట కలిపినా.. పలువరుసే ఎదుటివాళ్లను ఆకర్షిస్తుంది. అలా పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే.. నోటి దుర్వాసన మాయం కావాలంటే వెంటనే ఈ ప్రొఫెషనల్ టీత్ క్లీనర్‌ని తెచ్చేసుకోండి. మరీ ముఖ్యంగా స్మోకింగ్, వైన్, కాఫీ అలవాటున్నవాళ్లు దీంతో ఉపశమనం పొందొచ్చు. ఈ డెంటల్ కాలిక్యులస్ రిమూవల్ టూల్.. సాఫ్ట్, నార్మల్, మీడియం, స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ వంటి ఐదు అడ్జస్టబుల్ మోడ్స్‌తో పని చేస్తుంది. ఇది చిగుళ్ల ఇరుకుల్లో, దంతాల చుట్టూ పేరుకున్న గారను పూర్తిగా తొలగిస్తుంది. ఈ మెషిన్ కారణంగా పళ్లకు, పళ్ల మీది ఎనామిల్ పొరకు ఎలాంటి నష్టం వాటిల్లదు. దీనికి అడాప్టర్‌తో పాటు.. ల్యాప్టాప్తోనైనా, పవర్ బ్యాంక్తోనైనా, కారులోనైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు. సీ టైప్ చార్జర్ అనువైనది. లోపలికున్న దంతాలు, పై పళ్ల లోపలి భాగాలు స్పష్టంగా కనిపించడానికి ప్రత్యేకమైన డెంటల్ మిర్రర్ లభిస్తుంది. దీని హెడ్‌కి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో పళ్లను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 155 డాలర్లు. అంటే 12,893 రూపాయలన్న మాట. ఇతర మోడ్స్, ఆప్షన్స్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..
వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్‌కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలు తీసేవేసే ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్ సాయం తీసుకున్నాడు. పేషెంట్‌కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్ థియోటర్ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా, సర్జరీ చేయించుకున్న పేషెంట్‌కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ) -
వైరల్ వీడియో: పూల్ క్లీనర్‌కు సహాయం చేస్తున్న చిన్న సముద్రపు ఒట్టర్
-
అదిరిపోయే గాడ్జెట్..కాలుష్యాలు ఖతం!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్ పరిశోధకుడు కాయ్ జియా ఈ పోర్టబుల్ ఫుడ్ క్లీనర్‌ను రూపొందించారు. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. -
రన్నింగ్‌లో లారీ.. లోపలినుంచి అద్దాలు తుడుస్తుండగా..
శ్రీకాకుళం : కదులుతున్న లారీ అద్దాలు తుడుస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి క్లీనర్ కె.వెంకటరావు గాయపడ్డాడు. ఈ సంఘటన బొంతపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీలో ఉన్న వెంకటరావు లోపల ఉండే అద్దాలు తుడుస్తున్న క్రమంలో అవి ఊడిపోయాయి. దీంతో పట్టుతప్పి రోడ్డుపై పడిపోవడంతో కాలు, తలకు గాయాలయ్యాయి. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి లారీని నిలిపి వేయడంతో క్లీనర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. -
కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నకోవిడ్-19 వ్యాక్సిన్లు వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నప్పటికీ అన్ని పరిస్థితులలోనూ 100 శాతం రక్షణ ఇవ్వలేదని నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, వ్యాధినుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యగా వైరస్ బారిన పడి కోలుకున్న వారు వెంటనే తమ టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చాలని దంత వైద్యులు తాజాగా సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత వీటిని మార్చాలని పేర్కొన్నారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ డెంటల్ సర్జరీ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా అభిప్రాయం ప్రకారం వైరస్ నుంచి కోలుకున్నవారు తక్షణమే తమ టూత్ బ్రష్‌లను మార్చాలి. అలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్కు గురికాకుండా కాపాడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు అదే వాష్‌రూమ్‌ను ఉపయోగిస్తున్న వారిని కూడా ఇది రక్షిస్తుందంటున్నారు. బ్రష్‌లు, టంగ్ క్లీనర్లు కూడా వైరస్‌ను వ్యాప్తి చేస్తాయనే విషయాన్ని విస్మరించొద్దని డాక్టర్ ప్రవేష్ మెహ్రా వివరించారు. ఈ వాదనను ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ కూడా అంగీకరించారు. సాధారణంగా ఫ్లూ, దగ్గు, జలుబు బారిన పడిన వ్యక్తులకు కోలుకున్న తర్వాత టూత్ బ్రష్, క్లీనర్లను మార్చమని తాను సిఫారసు చేస్తాననీ, ఇపుడు కోవిడ్ బాధితులకు కూడా ఇదే సలహా ఇస్తున్నామని ఆమె తెలిపారు. టూత్ బ్రష్ ఉపరితలంపై బ్యాక్టీరియా / వైరస్ దాగి ఉంటుందని ఇది శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. టూత్ బ్రష్ ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది? సాధారణంగా ఒక వ్యక్తి దగ్గు, తుమ్ము, అరవడం, మాట్లాడటం లేదా నవ్వినప్పుడు విడుదలయ్యే తుంపర్లు , డైరెక్టుగా గానీ, కొంతకాలం గాలిలో ఉండిగానీ ముక్కు లేదా నోటిద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి బ్రష్ చేసినపుడు కూడా వైరస్ ఇలాగే వ్యాప్తి చెందుతుంది. కోలుకున్న తరువాత కూడా ఈ వస్తువులను నిరంతరం ఉపయోగించడం వల్ల అధిక సాంద్రత గల సార్స్ సీవోవీ-2 వైరస్ ఇతరులకూ సోకుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటిలో ఎవరికైనా కరోనావైరస్ సంక్రమించినట్లయితే, సోకిన వ్యక్తి ఉపయోగించిన టాయిలెట్ వస్తువులను (టూత్ బ్రష్, నాలుక క్లీనర్ మొదలైనవి) బయటకు విసిరేయడం మంచిదని వీరు సూచిస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ సరఫరా: కేంద్రానికి చుక్కెదురు సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్‌ఐఏ -
లారీ డ్రైవర్ నరకయాతన
అశ్వారావుపేటరూరల్: లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంతలో పడిపోయింది. అందులోని డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇనుప రాడ్ల లోడుతో విశాఖపట్నానికి వెళ్తున్న లారీ అర్థరాత్రి సమయంలో అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్దగల మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న భారీ గుంతలో పడిపోయింది. ఆ తరువాత చెట్టును ఢీకొంది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్ ఖాజిదే, క్లీనర్ చోటు ఇరుక్కుపోయారు. చాలాసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హెడ్ కానిస్టేబుల్ బాబురావు, పోలీస్ సిబ్బంది వచ్చి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సాధ్యపడకపోవడంతో సర్పంచ్ తెల్లం వీరకుమారి భర్త దుర్గారావు సహాయంతో స్థానిక యువకులు, జేసీబీతో క్యాబిన్ ఇరుక్కుపోయిన క్షతగ్రాతులను బయటకు తీశారు. డ్రైవర్‌కు కాలు విరిగింది. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం
-
ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం
తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడిపినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలు కడప సమీపంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. డ్రైవర్ గురవయ్య లారీని నడిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నాయుడుపేటలో లారీ యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
టిప్పర్ క్లీనర్ దుర్మరణం
బనగానపల్లె రూరల్: యాగంటిపల్లె గ్రామ సమీపంలో జీఎన్ఎస్ కాల్వ వద్ద ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని క్లీనర్ దుర్మరణం చెందాడు. మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన పాపిరెడ్డి కుమారుడు బత్తుల వెంకట శివారెడ్డి (32) టిప్పర్ క్లీనర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జీఎన్ఎస్ కాల్వ సమీపంలో మట్టిని అన్లోడింగ్ చేస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ వెనుక టైర్ల కింద పడి వెంకటశివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య శివమ్మ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్ఐ రాకేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టైరు మార్చుతుండగా లారీ ఢీ: క్లీనర్ మృతి
కొత్తూరు(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం రంగాపూర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. అనంతపురం జిల్లాకు చెందిన లారీ బత్తాయి లోడుతో హైదరాబాద్ వైపు వస్తుండగా రంగాపూర్ వద్ద టైరు పంక్చర్ అయింది. దీంతో క్లీనర్ గిరిబాబు టైరు మారుస్తున్నాడు. ఇంతలోనే హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు ద్రాక్ష లోడుతో వస్తున్న మరో లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో గిరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. -
రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు
నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లిలో సోమవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. విశాఖ వైపు వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న లారీలో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. -
రెండు లారీలు ఢీ: క్లీనర్ మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ అడ్డురోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్లు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
క్లీనర్ నడపడంవల్లే...
-
క్లీనర్ నడపడంవల్లే...
ప్రమాదసమయంలో తాను లారీలో లేనంటున్న డ్రైవర్ అయినా యజమాని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు లారీ యజమాని టీడీపీ నేతకు స్వయానా సోదరుడు పెనుకొండ: పెనుకొండ రైలుప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బాషా తప్పించుకున్నారని, నిద్రపోతున్న క్లీనర్ నాగరాజు చనిపోయారని పోలీసులు సోమవారం ఉదయం తెలిపారు. కానీ రాత్రికి కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాద ఘటనలో తాను లేనని, అయినా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డ్రైవర్ బాషా వెల్లడించారు. ఆయన అడ్వకేట్ సహాయంతో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ముందు లొంగిపోయేందుకు వచ్చారు. అయితే కే సు తమ పరిధిలోకి రాదని డీఎల్ఎస్ఏ చెప్పడంతో తిరిగి రైల్వే ఎస్పీని కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బాషా కోర్టు ఆవరణలో మీడియా సిబ్బందికి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కాఫీ తాగేందుకు లారీని ఓ చోట ఆపామని, అప్పుడు క్లీనర్ నాగరాజు లారీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని చెప్పారు. తాను వెనకే వస్తున్న మరో లారీ ఎక్కి 20 నిమిషాల తర్వాత బయలుదేరానని తెలిపారు. తాము రైల్వేక్రాసింగ్ వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగిందని, వెంటనే ఈ విషయాన్ని లారీ యజమాని వెంకటసుబ్బయ్యకు ఫోన్‌చేసి చెప్పామని తెలిపారు. అక్కడి నుండి వచ్చేయాలని యజమాని సూచించారని చెప్పారు. ప్రమాదానికి గురైన లారీని డ్రైవ్ చేస్తున్న నాగరాజుకు లెసైన్సు లేకపోవడంతో, డ్రైవ్ చేసినట్లు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. అయితే బాషా మాటలను రైల్వే డీఎస్పీ మధు కొట్టిపడేశారు. ‘‘లారీలో ఖచ్చితంగా డ్రైవర్ బాషా ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన క్లీనర్ నాగరాజుపైకి నెడితే అతను చనిపోయాడు కాబట్టి కేసు ఉండదు. అందువల్లే తాను లేనని బాషా చెబుతున్నారు. వాస్తవంగా అతనే డ్రైవింగ్ చేశారు’’అని ‘సాక్షి’తో చెప్పారు. అయితే వేగంగా వస్తున్న లారీలో నుంచి దూకితే డ్రైవర్ బాషాకు దెబ్బలు తగలాలి. అతను మామూలుగా ఉండటం గమనార్హం. మరోవైపు ప్రమాదానికి గురైన లారీ, బాషా ప్రయాణించిన మరోలారీ రెండూ తాడిపత్రికి చెందిన అతికారి వెంకటసుబ్బయ్యకు చెందినవే. ఆయన వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం టీడీపీ నేత అతికారి వెంకటయ్య (ఇతని భార్య జెడ్పీటీసీ సభ్యురాలు)కు స్వయాన సోదరుడు. ప్రమాదానికి గురైన లారీ టాటా 2003 మోడల్ అనీ, ట్యాక్స్, ఎఫ్‌సీ, ఐసీ, పర్మిట్లు సక్రమంగానే ఉన్నాయని డీటీసీ సుందర్ వెల్లడించారు. ఈ లారీలో 17టన్నుల బరువు రవాణా చేసేందుకు అనుమతి ఉండగా... గ్రానైట్ రాయి బరువు 25టన్నులదాకా ఉంటుందని గ్రానైట్ వ్యాపారులు చెబుతున్నారు. అధిక బరువు లోడ్ చేసినందుకూ, లెసైన్స్ లేని వ్యక్తిని డ్రైవరుగా పెట్టుకున్నందుకు లారీ యజమానిపై కేసు నమోదుచేయాల్సి ఉంది. అయితే లారీ యజమాని టీడీపీ నేత అయినందువల్ల డ్రైవర్ బాషాపై కేసు నమోదుచేసి, లారీ యజమానిని కేసునుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భయానక దృశ్యం చూడలేకపోయాం పెనుకొండ: బెంగళూరు నుంచి రాయచూరు వెళుతున్నా. 2-20 గంటల ప్రాంతంలో మా ముందు బోగీలో పెద్దశబ్దం వినిపించింది. తేరుకునేలోపే రైలు అటుఇటు కుదుపులకు గురయి నిలచిపోయింది. దిగి చూస్తే పక్క బోగీ ధ్వంసమైన దృశ్యం కనిపించింది. భయానకం దృశ్యం చూడలేకపోయా. - మౌనేష్‌నాయక్, దేవదుర్గ లారీ వేగంతో వచ్చి రైలును ఢీకొంది బెంగళూరు నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 2.20 గంటల ప్రాంతంలో వస్తోండగా గేటు వేసి పచ్చజెండా చేతిలో పట్టుకుని రూం ముందే నిల్చోని ఉన్నాను. ఆ సమయంలో మడకశిర నుంచి లారీ వేగంగా రావడం చూసి గట్టిగా కేకలు వేశా. అంతలోనే రైలు వేగంగా రావడం, లారీ గేటును, రైలును ఢీకొనడం క్షణాల్లో జరిగిపోయాయి. - తిమ్మయ్య, రైల్వే గేట్మెన్, షీఫారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాం రైలులో పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశాం. పోలీసులు రైలు వద్దకు వచ్చాక ప్రమాదం గురించి తెలుసుకున్నాను. - గంగప్ప, దేవదుర్గ -
లారీలోంచి పడి క్లీనర్ మృతి
ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా): వేగంగా వెళ్తున్న లారీలోంచి ప్రమాదవశాత్తు జారిపడి క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీను(35), లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం నేపాల్ నుంచి హైదరాబాద్ లోడ్‌తో వస్తున్న లారీ గాలి కోసం డోర్ తీసి కూర్చున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు వెళ్తున్న లారీలోంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని 108లో ఇచ్చాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఒడిశ్సాలోని భరంపూర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తునికి చెందిన డ్రైవర్ నాగేశ్వరరావు తెలిపాడు. -
డివైడర్‌ను ఢీకొట్టిన లారీ
-
క్యాబిన్లో నుంచి దూకేసిన డ్రైవర్,క్లీనర్