మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం రంగాపూర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
కొత్తూరు(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం రంగాపూర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. అనంతపురం జిల్లాకు చెందిన లారీ బత్తాయి లోడుతో హైదరాబాద్ వైపు వస్తుండగా రంగాపూర్ వద్ద టైరు పంక్చర్ అయింది.
దీంతో క్లీనర్ గిరిబాబు టైరు మారుస్తున్నాడు. ఇంతలోనే హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు ద్రాక్ష లోడుతో వస్తున్న మరో లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో గిరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు.