మన్సూర్ అన్సారీ (ఫైల్)
సాక్షి, కరీంనగర్: లారీ టైర్ పేలి పంక్చర్ వేసే వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా ఖాజీపూర్‌కు చెందిన మహమ్మద్ మన్సూర్ అన్సారీ(32) నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌లోని అమెర్నగర్కు వచ్చాడు. ఇక్కడే ఒక పంక్చర్ షాపులో పని చేస్తున్నాడు.
గురువారం ఒక లారీ టైర్ పంక్చరై, రావడంతో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి బావమరిది ఎండీ.హుస్సేన్ అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలుండగా వారు బిహార్‌లోనే ఉంటున్నారు.
ఇవి చదవండి: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment