tyre blast
-
టైరే కదా అని నిర్లక్ష్యం వద్దు.. పేలుతుంది.. జాగ్రత్త..!
వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు పైనుంచి ఎండ.. మరోవైపు రోడ్డు వేడి.. బైకో, కారో తీసుకొని రోడ్డుపైకి వెళ్తే టైర్లు ఉన్నట్టుంది పేలిపోయే ప్రమాదం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. పాత టైర్లకైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. ప్రతి వేసవిలోనూ టైర్లు పేలి రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తలు చూస్తూనే ఉంటాం. అందుకే ఈ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాలకు ముందు వాహన టైర్ల పటుత్వం కచ్చితంగా తెలుసుకోవాలి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు టైర్ల లోపల గాలిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో టైర్లు వేడెక్కి సమస్యలు సృష్టిస్తుంటాయి. వేసవిలోనే ఎందుకంటే.. టైర్ల వయస్సు: అరిగిపోయిన పాత టైర్లు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అవి పగిలిపోయే అవకాశం అధికం. టైర్ ప్రెజర్: టైర్ పగిలిపోవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి. తక్కువగా గాలి ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తుంటే టైర్ పైకి కిందికి బౌన్స్ అవుతుంది. దీంతో అదనపు ఘర్షణ ఏర్పడుతుంది. వేసవి వేడితో ఈ అదనపు ఘర్షణ తోడవడం వల్ల టైర్లు బలహీనపపడి పగిలిపోతాయి. ఈ సమస్య వేసవిలో మరీ ఎక్కువ. అధిక వేగం: టైర్లు పగిలిపోవడానికి మరొక సాధారణ కారణం అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించటం. దీనివల్ల వేడి జనించి టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనం బరువు, రోడ్డు ఉపరితలం నుంచి వచ్చే వేడితో టైర్లు అధిక ఒత్తిడికి గురై పగిలిపోవచ్చు. లోపభూయిష్ట టైర్లు: టైర్లు అరిగిపోయాయా, దెబ్బతిన్నాయా? అని నిర్ధారించుకోవాలి. ఎల్లప్పుడూ వాటి నాణ్యతను తనిఖీ చేయాలి. కోతలు, పగుళ్లు, ఉబ్బెత్తులు లేదా దెబ్బతిన్న టైర్లు వేసవిలో అధిక ఒత్తిడి కారణంగా పగిలిపోతాయి. వాహన బరువు: వాహనం బరువు ఎక్కువ లేకుండా జాగ్రత్తపడాలి. తద్వారా వేసవిలో టైర్లపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. టైర్ పగిలిపోతే: ప్రశాంతంగా ఉండాలి. వాహనంపై నియంత్రణతో ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడకూడదు. భయాందోళనకు గురైతే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు. భారీ బ్రేకింగ్‌ను నివారించాలి: హఠాత్తుగా బ్రేక్ వేయాలనుకున్నప్పటికీ పేలిన టైర్‌పై ఎక్కువగా బ్రేక్ వేస్తే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు. మంచు మీద డ్రైవింగ్ చేస్తున్నట్టు ఊహించుకొని సున్నితంగా బ్రేక్స్ వాడాలి. ముందు వైపున్న టైర్లు పగిలిపోతే బ్రేక్ అస్సలు ఉపయోగించవద్దు. వెళ్లాల్సిన దిశలో వాహనాన్ని నెమ్మదిగా నడిపించాలి. ట్రాఫిక్‌లో ఉన్నా, ఇతర వాహనదారులు చుట్టూ ఉన్నా సమస్య ఉందని వారికి తెలిసేలా హజార్డ్ లైట్లను ఆన్ చేయాలి. ఇదీ చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!యాక్సిలరేటర్‌ని ఉపయోగించాలి: బ్రేక్స్‌కు బదులు యాక్సిలరేటర్‌ను ఉప యోగించాలి. స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవాలి. తద్వారా వాహనాన్ని సరళ రేఖలో నడిపించగలుగుతారు. సురక్షిత ప్రదేశంలో: వాహనాన్ని సురక్షిత ప్రదేశం వైపు తీసుకెళ్లి ఆపాలి. హజార్డ్ లైట్లను ఉంచడం మర్చిపోవద్దు. రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్ పరికరాలు ఉన్నట్టయితే వాహనం ముందు, వెనుక వైపు ఉంచాలి. చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడుతప్పనిసరి జాగ్రత్తలు: అరిగిన, కాలం చెల్లిన టైర్లను తక్షణమే మార్చుకోవాలి. టైర్లు పరీక్షించి ఎక్కడ లోపం ఉన్నా సరిదిద్దుకోవాలి. -సాక్షి, నేషనల్ డెస్క్ -
లారీ టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి..
సాక్షి, కరీంనగర్: లారీ టైర్ పేలి పంక్చర్ వేసే వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా ఖాజీపూర్‌కు చెందిన మహమ్మద్ మన్సూర్ అన్సారీ(32) నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌లోని అమెర్నగర్కు వచ్చాడు. ఇక్కడే ఒక పంక్చర్ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఒక లారీ టైర్ పంక్చరై, రావడంతో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి బావమరిది ఎండీ.హుస్సేన్ అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలుండగా వారు బిహార్‌లోనే ఉంటున్నారు. ఇవి చదవండి: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం.. -
వైరల్: పాపం.. మృత్యువును ఊహించి ఉండరు
మనిషి ప్రాణాలు.. గాల్లో దీపంలాగా మారిన రోజులివి. అలాంటి ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. జేసీడీ టైర్లో గాలి నింపుతుండగా.. అది పేలి ఇద్దరు మరణించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. కూలీలు ఇద్దరూ జేసీబీకి చెందిన భారీ టైర్లో గాలి నింపుతుండగా.. దానిని మరో వ్యక్తి వచ్చి పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరూ చెల్లచెదురై పడిపోయారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడిన ఈ ఇద్దరిని మధ్యప్రదేశ్ రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ జిల్లాలో సిల్తారా ఇండస్ట్రీయల్ ఏరియాలో మే 3వ తేదీన ఈ ఘటన జరిగింది. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు..నలుగురి మృతి
అహ్మదాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుజరాత్‌లోని బార్వాలా-బోతాడ్ హైవే జరిగింది. లింబిడి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై తిరుగుప్రయాణంలో దేవాలయాన్ని దర్శించుకోవడానికి సాలంగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని బోతాడ్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే ఉప్పులేటికి తప్పిన ప్రమాదం
విజయవాడ: కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఆమె విజయవాడకు వెళ్తుండగా యనమలకుదురు వద్దకు రాగానే కరకట్టపై ఒక్కసారిగా స్కూటీ అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. టైర్ పేలినా కారు అదుపు తప్పక పోవడంతో ఆమె ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే కొంత సమయం వేచిచూసిన తర్వాత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మరో కారులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం.