విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు..నలుగురి మృతి | Four die as car hits electric pole | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు..నలుగురి మృతి

Published Thu, Feb 8 2018 6:37 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Four die as car hits electric pole - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుజరాత్‌లోని బార్వాలా-బోతాడ్‌ హైవే జరిగింది.

 లింబిడి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై తిరుగుప్రయాణంలో దేవాలయాన్ని దర్శించుకోవడానికి సాలంగపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని బోతాడ్‌ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement