నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లిలో సోమవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. విశాఖ వైపు వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న లారీలో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు.